జేడీ కొత్త పార్టీ పెట్టేస్తున్నారా ? రిస్క్ చేస్తున్నారా ? 

తాను పనిచేసిన హోదానే జనాలు ఇంటిపేరుగా పీల్చుకునే స్థాయికి ఎదిగి,  నీతి నిజాయితీ గల ఆఫీసర్ గా పేరుపొందిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ( VV Lakshmi Narayana ) మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు .

 Jd Lakshmi Narayana Is Going To Start A New Party Details, Jd Lakshminarayana, J-TeluguStop.com

తను పనిచేస్తున్న పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి దిగిన లక్ష్మీనారాయణ కు కాలం కలిసి రాలేదు.ఆయన సొంత పార్టీ పెడతారని, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను పోటీకి దింపుతారని అప్పట్లోనే విస్తృతంగా ప్రచారం జరిగినా  ఆయనకు ఓటమే ఎదురైంది.2019 ఎన్నికల్లో జనసేన( Janasena ) ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసినా ఓటమే ఎదురయ్యింది.మూడో స్థానంలో జేడీ నిలిచారు.

ఆ తరువాత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాల్లో బిజీ కావడం వంటివి లక్ష్మీనారాయణకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.అదే కారణంతో జనసేన పార్టీకి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చారు.ఇక అప్పటి నుంచి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు పాల్గొంటూ వస్తున్నారు.2024 ఎన్నికల్లో( 2024 Elections ) విశాఖ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో లక్ష్మినారాయణ ఉన్నారు.ఆయనకు వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.అయినా జేడీ మాత్రం తన నిర్ణయం ఏమిటి అనేది ప్రకటించడంలో సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Janasena, Jd, Pawan Kalyan, Telugudesam, Vishakapatnammp

ఈ నేపథ్యంలోనే ఆయన సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి.సొంత పార్టీ స్థాపించి ఆ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ చేసే ఆలోచనలలో ఉన్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే పార్టీ పెట్టడం తప్పు కాకపోయినా, ఏపీలో ఎన్నికలకు( AP Elections ) కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది .ఇంత తక్కువ సమయంలో పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి  దిగడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు.

Telugu Ap Cm Jagan, Ap, Janasena, Jd, Pawan Kalyan, Telugudesam, Vishakapatnammp

రాష్ట్ర వ్యాప్తంగా ఇంత తక్కువ సమయంలో పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం , పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం అంటే అది అషామాషి వ్యవహారం కాదు.అయినా లక్ష్మీనారాయణ అంత రిస్క్ చేస్తారా అనేది సందేహంగానే మారింది.నిజాయితీగల పోలీస్ అధికారిగా, సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా జగన్ అక్రమస్తుల కేసులో లక్ష్మీనారాయణ వ్యవహరించిన తీరు ఆయనకు మంచి పాపులారిటీ తీసుకువచ్చింది.ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడిన పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం అంటే లక్ష్మీనారాయణ బాగా రిస్క్ చేస్తున్నట్లే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube