నీకో దండం, నీ కారుకో దండం... ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జేడీ

తెలుగు సినిమా పరిశ్రమకు దాదాపు మూడు దశాబ్దాల క్రితం పరిచయం అయిన జేడీ చక్రవర్తి అనేక రకాల పాత్రలు పోషించడంతో పాటు, అనేక రంగాల్లో రాణించేందుకు ప్రయత్నించాడు.హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్రను వేసిన జేడీ తాజాగా ‘హిప్పి’ అనే చిత్రంలో కీలక పాత్రను పోషించడం జరిగింది.

 Jd Chakravarthi Comments On Ntr-TeluguStop.com

ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ హీరోగా నటించిన హిప్పి చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జేడీ చక్రవర్తి మీడియా ముందుకు వచ్చాడు.

జేడీ చక్రవర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.తాను ఒకానొక సమయంలో ఎన్టీఆర్‌ కారు ఎక్కడం జరిగింది.ఆ సమయంలో ఆయన నాకు చుక్కలు చూపించాడు.కారులో నేను నటించిన గులాబి సినిమాలోని పాట మేఘాలలో తేలిపోమ్మన్నది పాటను పెట్టి కారును 110 కిలోమీటర్ల స్పీడ్‌తో నడపడం ప్రారంభించాడు.

కళ్లు మూసుకుని మరీ ఎన్టీఆర్‌ కారును తోలుతుంటే నాకు వెన్నులో ఒణుకు పుట్టింది.ఎప్పుడు కారు దిగిపోతానా అనిపించింది.

అదే సమయంలో మేఘాలలో తేలిపోమ్మన్నది పాటలో నేను ఎందుకు చేశానా అంటూ ఆ సమయంలో నాకు అనిపించిందంటూ కామెంట్స్‌ చేశాడు.

నీకో దండం, నీ కారుకో దండం ఎన్�

ఎన్టీఆర్‌ ఒకప్పుడు కారు చాలా స్పీడ్‌గా తోలేవాడు.వందకు తగ్గకుండా మాత్రమే డ్రైవ్‌ చేసేవాడు.ఆ కారణం వల్లే ఎన్టీఆర్‌ ఒకసారి కారు ప్రమాదంకు కూడా గురయ్యింది.

కారు ప్రమాదం కారణంగా అప్పటి నుండి ఎన్టీఆర్‌ తన స్పీడ్‌ను తగ్గించుకున్నాడు.ఎన్టీఆర్‌ కారు ఒకప్పుడు చాలా స్పీడ్‌గా డ్రైవ్‌ చేసేవాడని గతంలో చాలా మంది చెప్పారు.

తాజాగా జేడీ చక్రవర్తి ఏకంగా ఎన్టీఆర్‌ కారు మళ్లీ ఎక్కాలంటే భయం వేస్తోంది అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం.ఎన్టీఆర్‌ కారు స్పీడ్‌ ప్రస్తుతం 90 లోపే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

బాధ్యతలు తెలిసిన ఎన్టీఆర్‌ ఇప్పుడు జాగ్రత్తగా వెళ్తున్నాడు.మరి ఇప్పుడు కూడా ఎన్టీఆర్‌ కారును జేడీ ఎక్కడా అంటూ కొందరు ఫ్యాన్స్‌ సరదాగా ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube