నా మీసం నా ఇష్టం ! కేసులపై జేసీ బ్రదర్ ఫైర్ 

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనంతపురం జిల్లా టీడీపీ కీలక నాయకులు జేసీ బ్రదర్స్- వైసీపీ మధ్య వివాదం రగులుతూనే ఉంది.టీడీపీ అధికారంలో ఉండగా జేసీ బ్రదర్స్ జగన్ ను ఆయన కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తదితర కారణాలతో జేసీ బ్రదర్స్ హవాను పూర్తిగా తగ్గించేందుకు జగన్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు.

 Jc Prabhakarareddy Angry On Police Cases Issue-TeluguStop.com

ఇప్పటికే జెసి దివాకర్ రెడ్డి సోదరుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడుపైన వివిధ కేసులు నమోదు చేయడంతో పాటు, అరెస్టుల వరకు వ్యవహారం వెళ్ళింది.ఆ తరువాత పూర్తిగా ప్రభాకర రెడ్డి సైలెంట్ అయిపోయారు.

అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తాడిపత్రి నుంచి టిడిపి కార్పొరేటర్లు ఎక్కువమంది గెలవడంతో, చైర్మన్ పదవిని ప్రభాకర రెడ్డి దక్కించుకున్నారు.

 Jc Prabhakarareddy Angry On Police Cases Issue-నా మీసం నా ఇష్టం కేసులపై జేసీ బ్రదర్ ఫైర్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సమయంలో జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.

ఇదిలా ఉంటే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి – జెసి కుటుంబాల మధ్య వివాదం తీవ్రస్థాయిలో ముదిరిపోయింది.ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ కేసుల వరకు వెళ్తుంది.

తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన ఘాటుగానే స్పందించారు.మీసం తిప్పితే కేసులు పెడతారా ? ఇలాంటి వాటికి భయపడేది లేదు అంటూ పెద్ద రెడ్డిని ఉద్దేశించి హెచ్చరించారు.గతంలో పెద్ద రెడ్డి మాట్లాడిన వాటిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని, నాపైన ఎందుకు కేసులు పెడుతున్నారు అంటూ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.

నా మీద కేసులు పెడతారా.? నా మీసం నా ఇష్టం అంటూ ప్రభాకర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు.ఈ వ్యవహారంలో తాను ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.

గతంలో ఒక రాజు జుట్టు పెంచితే పన్ను వేసే వారని, వారని ఇప్పుడు తిడితే కేసులు పెడుతున్నారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, రాష్ట్రం అంతా ఒక ఎత్తు తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం మరో ఎత్తు అని హెచ్చరించారు.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి పై మీసం తిప్పుతూ ప్రభాకర్ రెడ్డి సవాలు చేయడంతో దీనిపై వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పై 153 ఎ, 506 ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.దీనిపై ప్రభాకర్ రెడ్డి ఈ స్థాయిలో ఘాటుగా స్పందించారు.

#Jagan #Chandrababu #JC Brothers #Ysrcp #DIVAKARAREDDY

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు