పరిషత్ ఎన్నికల గురించి కీలక కామెంట్లు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..!!

నిన్న పరిషత్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన సంగతి తెలిసిందే.కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా దాదాపు పరిషత్ ఎన్నికలు సామరస్య వాతావరణంలో జరిగాయి.

 Jc Prabhakar Reddy Made Key Comments About Parishad Elections , Ysrcp, Nara Loke-TeluguStop.com

ఇలాంటి తరుణంలో తాజాగా ఈ ఎన్నికల గురించి తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక కామెంట్లు చేశారు.పరిషత్ ఎన్నికలు నిర్వహించడం ప్రజలకు ఇష్టం లేదని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

అందువల్లే తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్ శాతం 25 నుంచి 30 శాతానికి పడిపోయింది అని పేర్కొన్నారు.వాస్తవానికి ఎన్నికలు అనేసరికి తాడిపత్రి నియోజకవర్గం లో 70 శాతం పోలింగ్ నమోదవుతుంది కానీ ఈసారి తగ్గిపోయింది.

ఇదిలా ఉంటే పరిషత్ ఎన్నికలు చంద్రబాబు ఆదేశాల మేరకు బహిష్కరించినట్లు స్పష్టం చేశారు.ఇదే తరుణంలో పరిషత్ ఎన్నికల చాలాచోట్ల రిగ్గింగ్ చేశారని ఆరోపించారు.అంతేకాకుండా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఏదైనా ప్రశ్నిస్తే తమలాంటి వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.ఏది ఏమైనా ప్రజలు ఓట్లు వేయడానికి పెద్దగా మొగ్గు చూపటం లేదు అన్నట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube