టీడీపీ కోసం రక్తం చిందిస్తా అంటున్న జేసీ ?

తెలుగుదేశం పార్టీలో ఒక్కో నాయకుడు ఒక్కో తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.సీనియర్ నాయకుడు ఒక మాట అంటే, ఆయన రాజకీయ వారసుడు మరొక మాట చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

 Jc Pavan Kumar Sensational Coments Divakareddy, Prabakareddy Jc ,ananthapuram ,tadipathri, Jc Pawan Kumar, Chandrababu Naidu, Ysrcp, Jagan Governament, Ap Ploitics-TeluguStop.com

విషయానికి వస్తే, అనంతపురం జిల్లా టిడిపి కీలక నాయకుడు జేసీ ఫ్యామిలీ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు.వారు ఏ పార్టీ లో ఉన్నా, ఎక్కడా తమ హవాకు గండిపడకుండా పనులు చేయించుకోగలరు.

రాష్ట్రంలో ఏ పార్టీ గాలి బలంగా వీచినా, జెసి ఫ్యామిలీ ని మాత్రం ఏ గాలి ఏమి చేయలేదు.ఎప్పుడూ ఫలితాలు అనుకూలంగానే జెసి ఫ్యామిలీకి వస్తూ ఉంటాయి.

 Jc Pavan Kumar Sensational Coments Divakareddy, Prabakareddy Jc ,ananthapuram ,tadipathri, Jc Pawan Kumar, Chandrababu Naidu, YSRCP, Jagan Governament, Ap Ploitics-టీడీపీ కోసం రక్తం చిందిస్తా అంటున్న జేసీ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదంతా ఒకప్పుడు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జెసి ఫ్యామిలీ హవాకు గండి పడిపోయింది.జేసీ ప్రభాకర్, దివాకర్ రెడ్డి టార్గెట్ గా రాజకీయాలు నడుస్తున్నాయి.ఇప్పటికే జెసి ఫ్యామిలీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ట్రావెల్స్ వ్యాపారం పై దెబ్బకు పడింది.

వివిధ కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.ఆయనతో పాటు ఆయన కుమారుడు అస్మితరెడ్డి సైతం అరెస్ట్ అయ్యి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు చంద్రబాబు వారి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించినా, దయచేసి మా ఇంటికి రావద్దు అంటూ జెసి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ లో చెప్పినట్లుగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫిరెన్స్ లో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.టిడిపిని కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ ప్రకటించారు.తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని, ఇటువంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడే ప్రసక్తే లేదని పవన్ ప్రకటించారు.

అంతేకాదు తాము టిడిపిని వీడే ప్రసక్తే లేదని, అవసరమైతే టిడిపిని కాపాడుకునేందుకు రక్తం చిందిస్తాను అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు .ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తమను ఏ విధంగా టార్గెట్ చేస్తుందో అనే టెన్షన్ లో జెసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్న తరుణంలో, పవన్ కుమార్ ఈవిధంగా మాట్లాడటం పై టీడీపీలో పెద్ద చర్చే నడుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube