జగన్ అప్పుడే ఈ ముద్ర వేయించేసుకున్నాడా ?

జగన్ కన్ను ఎప్పుడూ సీఎం కుర్చీ మీదే.ఆయన ఎప్పుడూ కుర్చీ కుర్చీ అంటూ కలవరిస్తూ ఉంటాడు.

 Jc Diwakar Reddy Prises Ys Jagan Ruling-TeluguStop.com

ఆయనకు ఏం అనుభవం ఉందని సీఎం కుర్చీ కట్టబెట్టాలి ? ఏపీ అభివృద్ధిలో పయనించాలంటే అనుభవం కలిగిన నాయకుడు కావాలి అది ఒక్క చంద్రబాబు మాత్రమే.అంటూ తెలుగు తమ్ముళ్లు పదే పదే వైసీపీ మీద విమర్శల బాణాలు విసిరారు.

అయితే ప్రస్తుతం వారి నోర్లు తెరుచుకోవడంలేదు.ఎందుకంటే జగన్ ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి తన మార్క్ చూపిస్తున్నాడు.

నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కడా నాంచివేత ధోరణి అవలంబించడంలేదు.ఎంత పెద్ద సమస్య అయినా అధికారులతో చర్చించి వెంటనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నాడు.

ఇవన్నీ జగన్ పాలనపై పాజిటివ్ టాక్ ని అప్పుడే తెచ్చేసాయి.

సుదీర్ఘ కాలంగా ఎటూ తేలని తెలంగాణా ఏపీ భవనాల వివాదానికి ఒక్క ముక్కలే తేల్చేసారు.

పైగా వేయి కోట్ల పన్నుల బకాయి నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు.మరో వైపు తన ప్రాధాన్యతలు చెబుతూ అధికారులతో వివిధ శాఖ మీద రివ్యూస్ చేస్తున్నారు.

అధికారులతో ఫ్రెండ్లీ సీఎం అని పిలిపించుకుంటున్నారు.ఇక పోలవరం, ప్రత్యేక హోదా వంటి కీలకమైన విషయాల్లో తన విధానం స్పష్టంగా చెప్పేస్తున్నారు.

మరో వైపు ఆశా వర్కర్లకు మూడు వేల రూపాయల జీతాన్ని ఏకంగా పది వేలకు పెంచి అందరిని ఆశ్చర్యపరిచారు.సీఎం కి మనసు ఉండాలి తప్ప అనుభవం ముఖ్యం కాదని పాదయాత్రలో జగన్ చెప్పిన విషయాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నాడు.

-Telugu Political News

జగన్ దూకుడు చూసి రాజకీయ ప్రత్యర్థి అయిన తెలుగుదేశానికి అస్సలు మింగుడుపడడంలేదు.జగన్ పై ఏదైనా విమర్శలు చేద్దామా అంటే తాము అభాసుపాలు అవుతామనే భావన టీడీపీలో నెలకొంది.చివరకు జగన్ మీద డైరెక్ట్ గా విమర్శలు చేస్తూ వచ్చిన అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి కూడా జగన్ మీద ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తుండడం చూస్తుంటే జగన్ మార్క్ పాలన ముందు ముందు ఎలా ఉండబోతోందో అర్ధం అవుతోంది.అందుకే టీడీపీ కూడా జగన్ మీద రాజకీయ విమర్శలు చేయడానికి వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube