జగన్ భయంతో జేసీ వేసిన ప్లాన్ ఇదేనా ?

అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు, టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డికి సీఎం జగన్ భయం బాగా ఎక్కువ అయినట్టుగా కనిపిస్తోంది.గతంలో జగన్ కుటుంబంపైన, జగన్ పైన వ్యక్తిగత దూషణలు చేయడంతో పాటు తరచుగా అనుచిత వ్యాఖ్యలు చేసి అప్పట్లో జేసీ బ్రదర్స్ సంచలనం సృష్టించారు.

 Jc Diwakar Reddy Afraid Of Jagan Mohan Reddy-TeluguStop.com

కానీ ఆ సమయంలో సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జేసీ పై తన కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీనికి నిదర్శనంగా అన్నట్టు జేసీకి చెందిన అనేక వ్యాపారాలు, ట్రావెల్స్ పై అధికారులు నిత్యం దాడులు నిర్వహిస్తూ ఆయనను మానసికంగా, రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారు.

Telugu Jc Bussiness, Jcdiwakar, Jc Join Bjp, Jc Tadipatri-Political

ఒక దశలో తను వ్యాపారాలన్నీ మూసుకుంటే మూసుకుంటే మంచిదని జేసీ వ్యాఖ్యానించారు.కొద్ది రోజుల క్రితం ఓ కేసు నిమిత్తం తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు జేసీని పిలిచిన పోలీసులు ఆయనను ఎనిమిది గంటలపాటు అక్కడే వెయిటింగ్ లో పెట్టారు.స్టేషన్ బెయిలు తీసుకువెళ్లినా పోలీసులు పట్టించుకోకుండా ఉండడంతో జేసీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఆ తరువాత రోజు అనంతపురం జిల్లాకు వచ్చిన బిజెపి నాయకుడు సత్య ను కలిసి జేసీ దివాకరరెడ్డి బిజెపి పై పొగడ్తల వర్షం కురిపించారు.

Telugu Jc Bussiness, Jcdiwakar, Jc Join Bjp, Jc Tadipatri-Political

అభివృద్ధి జాతీయ పార్టీలతోనే సాధ్యం అంటూ ప్రకటించారు.ఇక ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా హెలిపాడ్ వరకు వెళ్లి మరి ఆయనకు స్వాగతం చెప్పారు.దీంతో ఆయన బిజెపి లోకి వెళ్లి పోవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది అని అంతా భావిస్తున్న సమయంలో మాత్రం తాను బీజేపీలో చేరేది లేదని ప్రకటించారు.

Telugu Jc Bussiness, Jcdiwakar, Jc Join Bjp, Jc Tadipatri-Political

ఇక్కడే తన రాజకీయ ఎత్తుగడలకు జేసీ పదును పెట్టారు.తాను టీడీపీలోనే ఉంటూ బీజేపీతో సన్నిహితంగా మెలగడం ద్వారా జగన్ నుంచి తాత్కాలిక రక్షణ పొందవచ్చనే ఆలోచనతో ఆయన ఉన్నారు.ఆ తరువాత రాజకీయ పరిణామాలను అంచనా వేసుకుని టిడిపి లో ఉండాల లేక బీజేపీ లో చేరితే మంచిదా అనేది ఆలోచించుకోవచ్చు అనేది జేసీ ఆలోచనగా తెలుస్తోంది.

అందుకే బీజేపీలో చేరకుండానే ఆ పార్టీ ముద్ర వేయించుకునేందుకు జేసీ ప్లాన్ చేశారు.ఇదే జగన్ నుంచి తనకు రక్షణ కల్పిస్తుందని జేసీ నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube