బాబు కి పంటి కింద రాయిలా..చెవిలో జోరీగలా..   JC Diwakar Counter Comments On Chandrababu Naidu     2018-10-23   11:59:37  IST  Surya

జేసీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. జేసీ ఏ పార్టీలో ఉన్నా సరే నిర్మొహమాటంగా తన మనసుకి నచ్చినట్టుగా మాట్లాడటంలో వెనుకా ముందూ కూడా చూసుకోడు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచీ టీడీపీలోకి వచ్చిన తరువాత ఎన్నో సార్లు చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు కూడా అదే సమయంలో జగన్ మంచోడు అంటూ బాబు కి బీపీ కూడా తెప్పించేవారు. వయసు అయిపోయి మాట్లాడుతున్నాడో లేక మాత్రి బ్రమించి మాట్లాడుతున్నాడా అనేట్టుగా జేసీ ఒక్కో సారి తన సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలా టీడీపీ లోకి వచ్చిన తరువాత ఎన్నో సార్లు టీడీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో గొడవలు విమర్శలు చుట్టూ ముట్టినా భయపడే స్వభావం కాదు జేసీది. మొన్నటికి మొన్న జేసీ సీఐ గొడవ, ఆ తరువాత ఎవరో స్వామీజీ పై గొడవ ఇలా ఎదో ఒక సంచలన విషయంలో జేసీ వేలో, కాలో ఉండాల్సిందే. నెలకొక్క సారయినా జేసీ బాబు కి బీపీ తెప్పించడం అలవాటుగా మారింది..అందుకే కాబోలు నిన్నటి రోజున జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా టీడీపీ పని ఖాళీ అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

JC Diwakar Counter Comments On Chandrababu Naidu-

జేసీ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ 40 శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల పై ప్రజలలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని జేసీ చేసిన తాజా వ్యాఖ్యలకి ఎమ్మెలేల లో గుబులు మొదలయ్యింది…సాక్షాత్తు సిట్టింగ్ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని పలువురు అంటున్నారు. అయితే చంద్రబాబు కి ఊరటని జేసీ ఇచ్చారు. చంద్రబాబునాయుడు పై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పిన జేసీ అంతలోనే 40 % మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు..అయితే ఈ లోటుని ఎలా పరిష్కరించాలో కూడా జేసీ సలహాలు ఇచ్చారు…ఆ 40 శాతం మందిని ముందు వెంటనే తీసిపడేయండి వారిని తప్పిస్తే చాలు అంటూ జేసీ అన్నారు. అయితే సొంత పార్టీ సీనియర్ నేత తమ పార్టీ ఎమ్మెల్యే లపైనే ఇలాంటి సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీకి ఎంతో కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుదని అంటున్నారు విశ్లేషకులు.