జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం! రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

రాయలసీమ అ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నాయకుడు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీలో తరపున ఎంపీ గా చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ ఎంపీగా గెలుపొందారు.

 Jc Divakar Reddy Ready To Quit From Politics-TeluguStop.com

ఏ పార్టీలో ఉన్న కూడా నిర్మొహమాటంగా మాట్లాడతూ, వివాదాలు కూడా కేంద్రబిందువుగా ఉండేవారు.ఏ స్థాయి నాయకుడితో అయిన నేరుగా మాట్లాడి తప్పులు చేస్తే ఎత్తి చూపే వ్యక్తిత్వం జేసీ దివాకర్ రెడ్డి సొంతం.

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు బరిలో దించాడు.

అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభంజనంలో జేసి తనయుడు కూడా ఓటమి పాలయ్యాడు.

ఇదిలా ఉంటే తాజాగా మీడియా ముందుకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలియజేశాడు.అదే సమయంలో తానూర్ జగన్ పై రాజకీయ విమర్శలు చేశాను తప్ప ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని, జగన్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని పొగడ్తలతో ముంచెత్తాడు.

అయితే తనకి మళ్లీ పార్టీ మారే యోచనలో లేదని రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని తెలియజేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని విషయాన్ని స్పష్టం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube