జయసుధ కొడుకు ఇప్పుడు ఎలా అయ్యాడో తెలుసా?

జయసుధ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా మరెన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొట్టిన హీరోయిన్ ఈమె.

 Jayasudha Son, Basthi Film, New Look, Shreyan Kapoor-TeluguStop.com

అప్పట్లో కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి అద్భుతంగా నటించిన ఆమె ఇప్పటికి అమ్మ పాత్రలో, అమ్మమ్మ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

జయసుధకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

ఆమె రెండొవ కుమారుడు శ్రేయాన్ కపూర్ సినిమాల్లో నటించాడు.అయితే శ్రేయన్ కపూర్ కు సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోయినప్పటికీ అతడు జయసుధ కోరిక మేరకు “బస్తీ” అనే సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

అయితే సినిమాల్లో అనుకున్నంత ప్రశంసలు రాకపోయేసరికి సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాడు శ్రేయన్.

అనంతరం అతనికి నచ్చిన “రైఫిల్ షూటింగ్” లో శిక్షణ పొందాడు.

శ్రేయన్ గన్ షూట్ లో ఎన్నో ప్రశంసలను అందుకున్నాడు.అంతేకాదు భారత్ షూటింగ్ జట్టుకు కోచ్ గా పని చేస్తున్నాడు.

అతడు జాతీయ ఛాంపియన్ గా శ్రయన్ పేరు పొందాడు.దాదాపు 30కి పైగా పతకాలను అందుకున్న శ్రేయన్ ప్రస్తుతం హైదరాబాదులో కొందరికి శిక్షణను అందిస్తున్నాడు.

కోచ్ గా మారిన శ్రేయన్ ప్రస్తుతం తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు.ఇటీవల అతని అన్న పెళ్ళిలో శ్రేయన్ లుక్ చూసి పలువురు షుక్ అయ్యారు.

ఎందుకంటే శ్రేయన్ ఎంతో అందంగా ఉంటాడు.కానీ పెళ్లి సమయంలో మాత్రం నెరిసిపోయిన తెల్ల జుట్టు తో దర్శనం ఇచ్చి అందరిని షాక్ కి గురి చేసాడు.

హీరోయిన్ గా నటించి ఎంతో గొప్ప పేరు సంపాదించినా జయసుధ తన కొడుకులను మాత్రం హీరోలను చేయలేకపోయింది.అయితే వారు సినిమాల్లో లేకపోయినప్పటికీ మంచి బిజినెస్ లు చేస్తూ స్థిరపడ్డారు ఇద్దరు కొడుకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube