భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నటి ఆత్మహత్యాయత్నం....  

jayashree eswar jayasudha thalaivi - Telugu Jayashree, Jayashree Attempts Suicide, Jayashree News, Jayashreelatest News, Kollywood Actress Jayashree, Kollywood Jayashree

ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తున్నారు.అంతేగాక మరికొందరైతే ఏకంగా కడతేర్చటానికి కూడా వెనుకాడడం లేదు.

TeluguStop.com - Jayashree Eswar Jayasudha Thalaivi

అయితే తాజాగా కోలీవుడ్లో బుల్లితెరపై నటించినటువంటి ఓ నటి భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే కోలీవుడ్ సినీ పరిశ్రమలో జయశ్రీ అనే నటి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ అలాగే బుల్లితెరపై కూడా నటిస్తోంది.

అయితే కష్టపడి నటిగా ఎదిగిన ఆమె అదే పరిశ్రమకి చెందినటువంటి ఈశ్వ ర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లైనా మొదట్లో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

కొద్దికాలం తర్వాత ఈశ్వర్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న జయశ్రీ ఈశ్వరుని పలుమార్లు నిలదీసింది.

దీంతో ఈశ్వర్ జయశ్రీ పై కోపం పెంచుకుని చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు.అంతేగాక అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉండేవాడు.

అయితే ఈ మధ్య విశ్వ చేసేటువంటి ఆగడాలు మరింత ఎక్కువ అవడంతో తట్టుకోలేక పోయిన జయశ్రీ సూసైడ్ నోట్ను కూడా రాశి ఆత్మహత్య చేసుకుంది.అంతేగాక ఈ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పింది.అయితే ఆమె త్వరగా స్పందించి ఆత్మహత్య చేసుకున్న టువంటి జై శ్రీ ని దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.అయితే ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

#Jayashree

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు