చరణ్ కోసం విలన్ వేషాలు వేస్తున్న నటుడు.. ఎవరంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘వినయ విధేయ రామ’ లాంటి డిజాస్టర్ తరువాత చరణ్ ఇంకా తన నెక్ట్స్ చిత్రాన్ని రిలీజ్ చేయకపోవడంతో, మెగా ఫ్యాన్స్ చరణ్ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

 Jayaram To Play Negative Role In Ram Charan Movie, Ram Charan, Rc15, Shankar, Ja-TeluguStop.com

దీంతో చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని వారు ఎంతో ఆశగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నాడు.

కాగా ఈ సినిమా తరువాత మరో పాన్ ఇండియా మూవీకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా రానున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో భారీ క్యా్స్టింగ్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇప్పటికే పలువురు స్టార్ యాక్టర్స్‌ను ఈ సినిమాలో తీసుకునేందుకు డైరెక్టర్ శంకర్ సంప్రదింపులు చేస్తున్నాడట.కాగా ఈ క్రమంలోనే మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత జయరామ్‌ను ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించేందుకు ఒప్పించారట చిత్ర యూనిట్.

ఈ సినిమాలో విలన్‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జయరామ్ నటిస్తాడని తెలుస్తోంది.తన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండటంతో జయరామ్ కూడా ఈ సినిమాను వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో హీరోకు తండ్రిగా జయరామ్ నటించాడు.ఈ సినిమా విజయంలో తనవంతు పాత్రను పోషించడంలో జయరామ్ సక్సెస్ కావడంతో, ఇప్పుడు ఆయనకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

అయినా కూడా ఆయన చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేయాలని చూస్తున్నారు.మరి చరణ్‌తో చేయబోయే సినిమాలో ఆయన విలన్‌గా మెప్పిస్తాడా లేడా అనేది తెలియాలంటే ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube