జయప్రదకు మరో పేరు ఉందన్న సంగతి తెలుసా..?

ఒకప్పట్లోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్ జయప్రద.తన అందంతో ఎంతో మంది అభిమానుల మనసులను దోచుకుంది.ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి.స్టార్ హీరోయిన్ గా నిలిచింది.చిన్నతనంలోనే ఇండస్ట్రీకి పరిచయమైన జయప్రద.మొదట్లో కొన్ని భాషాపరమైన ఇబ్బందులు ఎదురుకున్నదట.

 Jayapradha Talks About Gungi Gudiya Jayapradha, Gungi Gudiya, Tollywood, Sirisir-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ అందగత్తె కి మరో పేరు ఉందని.ఆ పేరుతో తనని బాగా పిలిచేవారని తెలిపింది.

తెలుగులోనే కాకుండా హిందీలో కూడా తన నటనతో మెప్పించింది జయప్రద.ఇక తనని బాలీవుడ్ లో మొదట్లో ‘గుంగీ గుడియా‘ అనే పేరు తో పిలిచే వారని తెలిపింది.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తను కొన్ని విషయాలు పంచుకుంది.సిరిసిరిమువ్వ సినిమా చేసినప్పుడు అందులో డైలాగులు చెబితేనే ఎక్స్ ప్రెషన్స్, ఆడియన్స్ కు అర్థమవుతాయా లేవా అని ఆలోచనలో ఉండేదట ఆ సమయంలో.

అటువంటి తను ఎటువంటి మాటలు లేకుండా ఓసారి జనాలకు అర్థం అయ్యేలా నటించాల్సి వచ్చిందని తెలిపింది.అప్పుడే తన వ్యవహారిక శైలి మరింత మెరుగుపడిందని ఆ తర్వాత ‘సర్గమ్‘ హిందీ వాళ్లు తను ఆ సమయంలో గుంగీ గుడియా అని పిలిచేవారని తెలిపింది.

మాటలు రావు కాబట్టి తన క్యారెక్టర్ని అలా చేసేవారని తెలిపింది.

కానీ ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టాక హిందీ బాగా మాట్లాడుతుందట.

దాదాపు రెండు గంటల పాటు హిందీ భాషలో మాట్లాడిందంట.అది కూడా యూపీ లాంగ్వేజ్ అంటూ అక్కడి హిందీ కూడా చాలా టఫ్ ఉంటుందని, యూపీ లాంగ్వేజ్ లో కూడా ఉర్దూ మాట్లాడాలని తెలిపింది.

ఇక హిందీ ఆడియన్స్ వల్లనే తను హిందీ నేర్చుకున్నానని, లేదంటే హిందీ వచ్చేది కాదని తెలిపింది.

Telugu Gungi Gudiya, Jayapradha, Sirisiri Muvaa, Tollywood-Movie

ఇక తను బాలీవుడ్ కి వెళ్లడం వల్ల కూడా హిందీ భాష పై మరింత పట్టుదల తో చేసేదట.ఇక ఆ సమయంలో నార్త్,సౌత్ ఫీలింగ్ ఎక్కువగా ఉండటంతో.తనకు హిందీ రాదని అందుకే గుంగీ గుడియా అని అనేవారని తెలిపింది.

ఇక హిందీ భాష నేర్చుకోవడం కోసం తెల్లవారుజామున 5 గంటలకు ఉర్దూ టీచర్ కూడా వచ్చేవారని తెలిపింది.అంతేకాకుండా తనతోపాటు టీచర్ ని కూడా లొకేషన్ కి తీసుకెల్లెదట.

యూపీ వాళ్లకు హిందీ తప్ప మిగిలిన భాషలు అర్థం కావని, ముంబై హిందీ సంపూర్ణంగా వేరుగా ఉండేదని, యూపీలో వేరుగా ఉండేదని తెలిపింది.అంతే కాకుండా అక్కడ ఏ డ్రెస్ వేసుకున్నా తను కూడ గుంగటి వేసుకుని తిరిగేదట.

షాయరీ నేర్చుకున్నానంటూ, డిక్షన్ రాకపోతే అక్కడి వాళ్ళు నవ్వుకునే వాళ్ళని, అందుకే తను కచ్చితంగా నేర్చుకొని అక్కడికి వెళ్లేదని తెలిపింది జయప్రద.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube