Jayalalithaa krishna : ఆ సీఎంకు కాల్ చేసి తన కుమార్తె పెళ్లికి రావద్దని చెప్పిన కృష్ణ.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తాజాగా తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.

ఘట్టమనేని అభిమానులు అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ ఈ వార్తను ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల పాటు ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ.

తాజాగా ఆయన మరణించడంతో యావత్ సినీ లోకం కంటతడి పెట్టింది.ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో జరిగిన ఒక సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది.

అదేమిటంటే ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తన కుమార్తె వివాహానికి రావద్దని చెప్పారట మన సూపర్ స్టార్ కృష్ణ.మరి అలా ఎందుకు చెప్పారు అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి వివాహ వేడుకను గల్లా జయదేవ్ తో చెన్నైలో నిశ్చయించారు.అయితే తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలితను సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా వెళ్లి పెళ్లికి ఆహ్వానించారట.

అప్పుడు ఆమె ఆ వివాహానికి తప్ప కుండా వస్తానని మాటిచ్చిందట.అయితే వివాహానికి మూడు రోజుల ముందు జరిగిన సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి సూపర్ స్టార్ కృష్ణ ను కలిసి మండపంలో మొదటి మూడు వరసలో భద్రతా కారణాల రీత్యా జయలలిత కోసం కేటాయించవలసిందిగా సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణని కోరారట.

ఆ మాటకు షాక్ అయిన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు వివాహానికి వస్తుండడంతో ఆ విషయాన్ని చెప్పి మూడు వరుసలో పూర్తిగా కేటాయించడం కుదరదని చెప్పేశాడట.వెంటనే కృష్ణ జయలలిత ఫోన్ చేసి పరిస్థితిని వివరించారట.అంతేకాకుండా జయలలిత ను సున్నితంగా వివాహానికి రావద్దని చెప్పి ఆమె ఆశీర్వచనాలు ఉంటే చాలని తెలిపారట కృష్ణ.

ఇక ఆ విషయాన్ని అర్థం చేసుకున్న జయలలిత వివాహం రోజున పెళ్ళికి హాజరుకాకుండా వధువు వరులకు ఒక బొకేలు పంపారట.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు