షాక్‌: అమ్మ ఆస్తుల‌పై 16 సంవ‌త్స‌రాల క్రిత‌మే వీలునామా

దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతితో ఎనో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు లేవు.జ‌య త‌ర్వాత ఆమె వార‌స‌త్వం కోసం ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌, అమ్మ బంధువుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రుగుతోంది.

 Jayalalithaa Done Her Assets Wills 16 E\years Before..?-TeluguStop.com

ఈ వార్ ఇలా ఉండ‌గానే ఆమె ఆస్తులు ఎవ‌రికి చెందాల‌నే విష‌యంలో కూడా పెద్ద వార్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.ఇదిలా ఉంటే హైద‌రాబాద్ స‌మీపంలోని జీడిమెట్ల‌లో ఉన్న ఆమ్మ ఆస్తులు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చెందాలంటూ హైకోర్టులో ఓ ప్ర‌జాహిత వాజ్యం కూడా దాఖ‌లైన సంగ‌తి తెలిసిందే.

ఇక అమ్మ ఆస్తుల‌పై శ‌శిక‌ళ క‌న్నేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా, జయ మేనకోడలు దీప, జయ చెల్లెలి కూతురు అమృత, జయ సవతి సోదరుడు వాసుదేవన్ ఇలా జయ బంధువులు అందరూ ఆమె ఆస్తులన్నీ తమిళనాడు ప్రజలకే చెందాలని కోరుతున్నారు.ఇదిలా ఉంటే ఇపుడు కొత్తగా మ‌రో షాకింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జయలలిత 16 సంవత్సరాల క్రిందటే తన బంధువుల పేరున వీలునామా రాసినట్టు తెలుస్తోంది.

హైద‌రాబాద్ స‌మీపంలోని జేజే గార్డెన్స్ పేరుతో రెండు ట్ర‌స్ట్‌ల‌ను కూడా రిజిస్ట‌ర్ చేశారు.

అయితే అమ్మ ఈ వీలునామా ఎవ‌రి పేరు మీద రాశార‌న్న‌దానిపై స్ప‌ష్ట‌త లేక‌పోయినా రిజిస్ట్రేష‌న్ శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం బుక్ -3లో న‌మోదైన వివ‌రాల ప్ర‌కారం వీలునామా స‌మాచారాన్ని ఎవ‌రికి రాశారో వారికే త‌ప్ప మిగిలిన ఎవ్వ‌రికి ఈ వివ‌రాలు వెల్ల‌డించ‌లేమ‌ని అధికారులు చెపుతున్నార‌ని స‌మాచారం.

సాధార‌ణంగా రిజిస్ట్రేష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎవ‌రైనా త‌మ ఆస్తులు లేదా ట్ర‌స్ట్‌ల‌ను రిజిస్ట‌ర్ చేయాల‌నుకుంటే స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యానికి స్వ‌యంగా వెళ్లి రిజిస్ట‌ర్ చేయాల్సి ఉంటుంది.

అయితే ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉన్న వారు, మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న‌వారు ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ప్రైవేట్ అటెండెన్స్ ద్వారా స‌బ్ రిజిస్ట్రారే వినియోగ‌దారుల ఇంటిఇక వెళ్లి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది.

జ‌య కూడా 16 ఏళ్ల క్రిత‌మే త‌న ఆస్తుల‌ను బంధువుల పేరిట ఈ ప్ర‌క్రియ ద్వారానే వీలునామా రాసిన‌ట్టు తెలుస్తోంది.

నాడు ఆమె హైద‌రాబాద్‌లోని జేజే గార్డెన్స్‌కు వ‌చ్చిన‌ప్పుడు ఈ ప్ర‌క్రియ ద్వారా మేడ్చ‌ల్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ఈ వీలునామా ప్ర‌క్రియ పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం.జ‌య బంధువుల‌కు వీలునామా రాసినా అవి ఎవ‌రి పేరున ఉన్నాయ‌న్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube