అమ్మ బయోపిక్‌ క్రేజ్‌కు నోరు వెళ్లబెట్టాల్సిందే  

Jayalalithaa Biopic Thalaivi Ott 55crores - Telugu 55crores, Amma Biopic, Jayalalitaa Biopic, Kangana Ranaut, Ott, Tamilnadu Ex Cm Jayalalithaa

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా దాదాపుగా వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ‘తలైవి’ చిత్రం ఎప్పుడు విడుదల అయ్యేనో తెలియదు కాని సినిమాకు మాత్రం విపరీతమైన క్రేజ్‌ ఉంది.అద్బుతమైన స్పందన ఉన్న ఈ నేపథ్యంలో సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా 55 కోట్లు ఇచ్చి మరీ కొనుగోలు చేసేందుకు సిద్దం అయ్యింది.

 Jayalalithaa Biopic Thalaivi Ott 55crores

ఇప్పటికే ఈ డీల్‌ క్లోజ్‌ అయ్యిందని తెలుస్తోంది.ఈ మొత్తం సినిమా విడుదల సమయం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని ముందే ఆ సంస్థ క్లోజ్‌ చేసింది.

బడ్జెట్‌లో సగానికి పైగా డిజిటల్‌ రైట్స్‌ ద్వారా వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు ఫుల్‌ హ్యాపీ.సినిమా షూటింగ్‌ ఈ ఏడాదిలో పూర్తి చేయాలని భావించినా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతోంది.

అమ్మ బయోపిక్‌ క్రేజ్‌కు నోరు వెళ్లబెట్టాల్సిందే-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతంకు షూటింగ్‌ జరగడం లేదు.మరికొన్ని రోజుల్లో షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఈ చిత్రంలో అమ్మ పాత్రను పోషిస్తున్న నేపథ్యంలో సౌత్‌లో కంటే ఉత్తరాదిన ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్‌ ఉంది.అన్ని భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్‌ ఉన్న కారణంగా సినిమాను ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రంలో జయలలిత జీవితంకు చెందిన పలు చీకటి కోణాలను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test