జయలలిత బయోపిక్ వెబ్ సిరిస్ టీజర్ డేట్ ఫిక్స్  

Jayalalitha Biopic Web Series Teaser Date Fix - Telugu Jayalalitha Biopic Web Series, Kollywood, Ramyakrishna, Teaser Date Fix, Tollywood

అన్నాడీఎంకే అధినేత్రి, తలైవి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత జీవితంలో ఎన్నో.కోణాలు కోణాలు ఉన్నాయి.

Jayalalitha Biopic Web Series Teaser Date Fix

బాల నటిగా కెరీర్ ప్రారంభించిన జయలలిత తర్వాత హీరోయిన్ ఎదిగి అనంతరకాలంలో ఎంజీఆర్ మార్గంలో పార్టీలో చేరి ఆ పార్టీ అధినేత్రిగా ఎదిగింది.ఆమె రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది.

ఇలాంటి కథ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే జయలలిత జీవితం తమిళనాడులో ఇద్దరు దర్శకులు సినిమాలుగా తెరకెక్కిస్తే, మరోవైపు స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తోంది.ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఎం.ఎక్స్ ప్లేయర్‌లో ఈ వెబ్‌సిరీస్ ప్రదర్శితం కానుంది.ఇప్పటికే కంగనా లీడ్ రోల్ లో తలైవి టైటిల్ తో భారీ బడ్జెట్ తో జయలలిత సినిమా తెరకెక్కుతుంది.మరో వైపు నిత్యా మీనన్ టైటిల్ రోల్ లో సినిమా తెరకెక్కుతుంది.

ఇక క్వీన్ టైటిల్ తో రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సీరిస్ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jayalalitha Biopic Web Series Teaser Date Fix-kollywood,ramyakrishna,teaser Date Fix,tollywood Related....