జయలలిత బయోపిక్ ‘తలైవి’ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: తలైవి
నటీనటులు: కంగనా రనౌత్, అరవింద్ స్వామి, సముథ్రకణి, నాజర్ తదితరులు
సంగీతం: జి.వి.

 Jayalalitha Biopic Thalaivi Review And Rating, Thalaivi, Kangana Ranaut, Aravind-TeluguStop.com

ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: విశాల్ విట్టల్
నిర్మాతలు: విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్, బృందా ప్రసాద్
దర్శకత్వం: ఏఎల్ విజయ్
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 10, 2021

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితకథ ఆధారంగా తరకెక్కిన చిత్రం ‘తలైవి’.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, నేషనల్ అవార్డ్ విన్నర్ కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక జయలలిత జీవితకథలో ఎలాంటి వివాదాలను చూపిస్తారా అనేది ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

ఆమె సినీ ప్రస్థానంతో పాటు రాజకీయ జీవితంలోని వెలుగు చీకటిలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ఏఎల్ విజయ్.నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ‘తలైవి’ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:

తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది నటి జయలలిత(కంగనా రనౌత్).ఈ క్రమంలో తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్(అరవింద్ స్వామి)తో వరుసగా సినిమాలు చేస్తూ ఆయన మన్ననలు అందుకుంటుంది.వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుంటారు.కట్ చేస్తే.ఎంజీఆర్‌ను గురువుగా భావించే జయ, ఆయన సూచన మేరకు రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది.ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలితకు కీలక పదవిని అప్పగిస్తారు.

అయితే అనుకోని కారణాల వల్ల జయలలిత అంటే ఏఐడిఎంకె పార్టీలో కొందరికి ఇష్టం ఉండదు.దీంతో ఆమెను ఎప్పుడెప్పుడు తప్పిద్దామా అని వారు చూస్తుంటారు.

ఈ క్రమంలో ఎంజీఆర్ హఠాన్మరణంతో జయలలిత తీవ్ర నిరాశకు లోనవుతుంది.ఇదే అదనుగా భావించిన కొందరు, ఆమెపై దాడి చేసి తీవ్రంగా అవమానిస్తారు.

ఈ అవమానం భరించలేక జయలలిత ఏం చేసింది.? ఆమె రాజకీయ ప్రస్థానం ఎలాంటి మలుపు తిరిగింది రాజకీయాల్లో జయలలిత ఎలాంటి మార్క్‌ను మిగిల్చారు? అనేది సినిమా కథగా మనకు చూపించారు.

విశ్లేషణ:

జయలలిత జీవితకథనుతలైవిచిత్రంతో మరోసారి మన కళ్లకు కట్టి చూపించే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్.దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు చాలా మంది ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో అనుకున్నారు.

అయితే ఎన్ని అడ్డంకులు, వివాదాలు వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ సినిమాను పూర్తి చేసి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.జయలలిత జీవితంలోని ముఖ్య ఘట్టాలను మనకు ఈ సినిమాలో మరోసారి చూపించారు.

ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే ఫస్టాఫ్‌లో జయలలిత యుక్తవయసులో ఉండగా, ఆమె సినిమాల్లోకి వచ్చేందుకు ఎవరు ప్రోత్సహించారు అనేది మనకు చూపించారు.ఇక ఎంజీఆర్‌తో జయలలిత ప్రేమాయణం కూడా మనకు ఈ సినిమాలో చూపించారు.

అయితే సినిమాల్లో దూసుకుపోతున్న జయలలితను ఎంజీఆర్ ఎందుకు పక్కనబెట్టారు అనేది చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది.అయితే ఎంజీఆర్ సూచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు జయలలిత రెడీ కావడంతో ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

Telugu Aravind Swamy, Kangana Ranaut, Thalaivi, Thalaivi Review, Thalaivi Telugu

అటు సెకండాఫ్‌లో జయలలిత పొలిటికల్ లైఫ్‌ను మనకు చూపించారు.ఇందులో జయలలిత ఏఐడిఎంకె పార్టీలో ఎలాంటి పదవులు చేపట్టింది, ఆమెను ఎవరు ఎదురిస్తారు, ఆమెకు ఎలాంటి పరాభవాలు ఎదురయ్యాయి వంటి అంశాలను చూపించారు.అయితే ఆమెకు ఎదురైన అవమానాలను ఆమె ఎలా అధిగమించి తమళనాడు సీఎంగా ఎలా మారారు అనేది మనకు క్లైమాక్స్‌లో చూపించారు.మొత్తానికి జయలలిత సినీ, రాజకీయ జీవితాన్ని మరోసారి ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశారు తలైవి చిత్ర యూనిట్.

నటీనటుల పర్ఫార్మెన్స్:

జయలలిత లాంటి లెజెండ్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మెస్మరైజ్ చేసిందని చెప్పాలి.జయలలితకు ఎదురైన సమస్యలు, తన జీవితంలోని ముఖ్యమైన అంశాల్లో కంగనా నటన అదిరిపోయింది.

ఆమె పలికించిన హావభావాలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావడం ఖాయం.ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అరవింద్ స్వామి నటన అద్భుతంగా నిలిచింది.

ఎంజీఆర్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు.ముఖ్యంగా జయలలితో ఎంజీఆర్ ప్రేమాయణంలో అరవింద్ స్వామి అదరగొట్టాడు.

ఇక ఈ సినిమాలో నాజర్, సముథ్రకణి, భాగ్యశ్రీ, మధుబాలా వంటి యాక్టర్స్ వారివారి పాత్రల్లో నటించి మెప్పించారు.

Telugu Aravind Swamy, Kangana Ranaut, Thalaivi, Thalaivi Review, Thalaivi Telugu

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్‌లో ఏం చూపించాలని భావించాడో, అది పర్ఫెక్ట్‌గా చూపించడంలో సక్సె్స్ అయ్యారు.సినిమాలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఆయన ఎంచుకున్న కథనం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమాలోని నటీనటులతో ఆయన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్‌ను చూపించారు.

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో మేజర్ అసెట అని చెప్పాలి.అలనాటి సమయాన్ని మరోసారి మనకు చూపించారు.

ముఖ్యంగా జయలలిత, ఎంజీఆర్‌లను అచ్చుగుద్దినట్లు చూపించడంలో కెమెరామెన్ పనితనం కనిపిస్తుంది.ఇక జీవి ప్రకాష్ అందించిన సంగీతం బాగుంది.

ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

Telugu Aravind Swamy, Kangana Ranaut, Thalaivi, Thalaivi Review, Thalaivi Telugu

చివరగా:

తలైవి – జయలలిత కథను మరోసారి చూపించారు!

రేటింగ్:3.0/5.0

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube