జయలలిత బయోపిక్ కోసం కంగనాకి 24 కోట్లు! వాస్తవం ఏంటో చెప్పిన నిర్మాత  

జయలలిత బయోపిక్ కోసం కంగనా రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Jayalalitha Biopic Starring Kangana Ranaut-jayalalitha Biopic,kangana Ranaut,tollywood

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ జోరుగా నడుస్తుంది స్టార్ హీరోలు అందరూ బయోపిక్ ల మీదనే ఆసక్తి చూపిస్తున్నారు. నిజజీవిత కథలలో ఎక్కువ డ్రామా ఉంటుందని, అలాంటి వాటిని తెరపై ఆవిష్కరిస్తే నటులుగా మరో మెట్టు పైకి ఎక్కినట్లు అవుతుందని అందరూ భావిస్తున్నారు. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బయోపిక్ ల మీద ఆసక్తి చూపించే వారు, అలాగే వాటిని తెరపై ఆవిష్కరించే దర్శకులు ఎక్కువైపోయారు..

జయలలిత బయోపిక్ కోసం కంగనాకి 24 కోట్లు! వాస్తవం ఏంటో చెప్పిన నిర్మాత-Jayalalitha Biopic Starring Kangana Ranaut

ప్రస్తుతం తమిళంలో జయలలిత బయోపిక్ గురించి హాట్ టాపిక్ వినిపిస్తుంది. ఇప్పటికే మణికర్ణిక సినిమాతో సత్తా చాటిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ ఇప్పుడు జయలలిత బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తుంది. జయ బయోపిక్ ని ముగ్గురు దర్శకులు తెరకేక్కిస్తూ ఉండగా అందులో ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి నిర్మాతగా తెరకెక్కుతున్న బయోపిక్ లో కంగనా నటిస్తుంది.

దీనికి సంబంధించిన అధికారిక విషయాన్ని ఇప్పటికే దర్శక నిర్మాతలు కన్ఫర్మ్ చేసారు.

ఇదిలా ఉంటే ఈ బయోపిక్ కోసం కంగనా ఏకంగా 24 కోట్లు పారితోషికం తీసుకుంటుంది అనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ స్టార్ హీరో తీసుకునే స్థాయిలో ఆమె రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. అయితే ఇందులో వాస్తవం ఉండే అవకాశాలు లేవని చాలా మంది కొట్టి పారేస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత విష్ణు ఇందూరి మాట్లాడుతూ కంగనా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడానికి పూర్తి అర్హత ఉందని, అయితే ఇస్తున్నామనే వార్తలలో మాత్రం నిజం లేదని స్పష్టం చేసారు. కంగనా ఎంతో ఇష్టపడి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒకే చెప్పినట్లు చెప్పుకొచ్చారు.