ఇంతకీ జయలలిత కన్నడ వాసినా? తమిళ మహిళనా?

జయలలిత.తమిళనాడు ముఖ్యమంత్రిగా జనాలకు సుపరిచితం.

 Jayalalitha Belongs To Which Nativity Tamil Or Kannada Details, Actress Jayalalitha, Jayalaitha Nativity, Tamil Nadu, Karnataka, Tamilnadu Cm, Heroine Jayalalitha, Ganga Gowri Movie, Jayalaitha Family-TeluguStop.com

అంతకు ముందు ఈ అమ్మడు సినిమా హీరోయిన్ గా రాణించింది.గ్లామరస్ నటీమణిగా ఎన్నో అద్భుత సినిమాల్లో యాక్ట్ చేసింది.

అయితే ఈమె విషయంలో చాలా వివాదాలు నడిచాయి.ఆమె స్థానికత మీద కూడా చాలా చర్చ నడిచింది.

 Jayalalitha Belongs To Which Nativity Tamil Or Kannada Details, Actress Jayalalitha, Jayalaitha Nativity, Tamil Nadu, Karnataka, Tamilnadu Cm, Heroine Jayalalitha, Ganga Gowri Movie, Jayalaitha Family-ఇంతకీ జయలలిత కన్నడ వాసినా తమిళ మహిళనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమెను కన్నడ లేడీగా చాలా మంది భావిస్తారు.ఒకరోజు బి ఆర్ పంతులు దర్శకత్వంలో మైసూరు ప్రీమియర్ స్టూడియోలో గంగా గౌరి అనే సినిమా షూటింగ్ కొనసాగుతుంది.

అదే సమయంలో స్టూడియో బయట ఏదో ఆందోళన మొదలయ్యింది.కొంత మంది ఏకంగా స్టూడియో లోపలికి దూసుకొచ్చారు.

జయలలితతో మాట్లాడాలని గొడవ చేశారు.

నేను తమిళనాడు వాసిని కాదు.

కన్నడ మహిళను అని జయలలిత చెప్పాలట.అదే వారి ఆందోళనకు కారణం కూడా.

వాళ్లు అలా ఎందుకు అంటున్నారో అర్థం కాలేదు.ఎందుకు చెప్పాలని వారిని ఆమె ప్రశ్నించింది.

దానికి మీరు మైసూరులోనే పుట్టారు కదా అని అడిగారు.అవును అని చెప్పింది.

అయితే మీరు మైసూరు మహిళే.అందుకే మీరు కన్నడవాసిని అని చెప్పాలని కోరారు.తాను పుట్టింది మైసూరులోనే అయినా.మా తాత ముత్తాతలు అంతా తమిళనాడుకు చెందిన వారే.అందుకే నేను తమిళనాడు వాసిని అని చెప్పింది జయలలిత.ఆమె చెప్పిన విషయం వారికి నచ్చడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Telugu Ganga Gowri, Jayalalitha, Jayalaitha, Karnataka, Tamil Nadu, Tamilnadu Cm-Movie

తమిళనాడుకు చెందిన చాలా మంది ఆమె కన్నడ వాసిగా భావించేవారు.కానీ అది వాస్తవం కాదు.ఏదో ఒక గుర్తింపు కోసం తప్ప.ఈ ప్రాంతీయ బేధాలు అనవసరం అనేది జయలలిత. వాస్తవానికి తన తాత తండ్రులు అంతా తమిళనాడు లోని శ్రీరంగంలోనే ఉండేవారు.ఆమె కుటుంబంలో కొంత మంది విడిపోయి ఏపీలోని గుంటూరు, నెల్లూరుతో పాటు మరికొంత మంది మైసూరులో స్థిరపడ్డారు.

జయలలిత తల్లి సంధ్య తాత ఊరు నెల్లూరు.అక్కడ వాళ్లకు చాలా భూములు ఉన్నాయి.

అక్కడి ఊరి పెద్దల్లో తను కూడా ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube