Jayaho BC CM Jagan : జయహో బీసీ... 'భారీ ' ప్లానే వేసిన జగన్ ?

వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీసీ సామాజిక వర్గాలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది.టీడీపీకి బీసీలు వెన్నుదన్నుగా నిలబడుతూ ఉండడంతో , వారిని తమవైపుకు పూర్తిగా తిప్పుకునేందుకు వైసిపి ప్లాన్ చేసుకుంది.2019 ఎన్నికల సమయంలోనే బిసి సామాజిక వర్గంలో చీలిక వచ్చి మెజార్టీ బీసీలు జగన్కు అండగా నిలబడ్డారు .ఇక పూర్తిగా వారు మద్దతు కూడగడితే టిడిపికి రాబోయే ఎన్నికల్లోను పరాభవమే ఎదురవుతుందని జగన్ భావిస్తున్నారు.ఇప్పటికే బీసీ కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వాటికి చైర్మన్ లను నియమించారు.బీసీ కులాల్లో ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దానికి భారీగా నిధులు కేటాయించడం వంటివి చేపట్టారు .
  పూర్తిగా తమది బిసి ప్రభుత్వం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జయహో బీసీ పేరుతో భారీ సభను ఏర్పాటు చేశారు .ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.బీసీ సమాజిక వర్గానికి చెందిన వైసిపి ప్రభుత్వంలో పదవులు పొందిన ప్రజాప్రతినిధులంతా దీనికి హాజరు కాబోతున్నారు.

 Jayaho Bc Jagan Made A Huge Plan,jagan, Ap Cm Jagan, Jayaho Bc, Bc Meeting Ysrcp-TeluguStop.com

దాదాపు 84 వేల మందికి ప్రత్యేక ఆహ్వానాలు వైసీపీ నుంచి వెళ్లాయి .ఈ సభలో ఈ మూడున్నర ఏళ్ల లో బీసీల కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ? రాబోయే రోజుల్లో ఏం చేయబోతుందనే విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటిస్తారు.
 

Telugu Ap Cm Jagan, Ap, Bc Ysrcp, Jagan, Jayaho Bc, Ysrcp-Political

అందుకే ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు నిర్వహిస్తున్నారు.పార్టీ ప్లీనరీ తరహాలోని ఈ సభకు ఏర్పాట్లు చేశారు.175 నియోజకవర్గాలలోను 2000 బస్సులను ఏర్పాటు చేశారు.వీటికి అదనంగా మరో రెండు వేల భారీ వాహనాల్లో బీసీ ప్రతినిధులు ఈ సభకు హాజరు కాబోతున్నారు.

సొంత వాహనాల్లోనూ వేలాదిమంది తరలి వస్తున్నారు.పూర్తిగా బీసీ సామాజిక వర్గం పై వైసీపీ ముద్ర పడే విధంగా జగన్ వ్యవహత్మకంగా ఈ సభను నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గానికి జగన్ భారీగా వరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.జయహో బీసీ సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.12 గంటలకు జగన్ మాట్లాడుతారు.ఈ సభ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube