టీచర్ మీద కోపంతో సినిమాల్లోకి వచ్చిన నటుడు ఎవరో తెలుసా?  

Actor Jaya Prakash Reddy Entry to movie because of his teacher, jayapraksh reddy, guntur, rayalaseema slang, tollywood actor - Telugu Actor Jaya Prakash Reddy Entry To Movie Because Of His Teacher, Guntur, Jayapraksh Reddy, Rayalaseema Slang, Tollywood Actor

ఏమి రా నోరు లేచ్చండాదే? అన్నా… పెళ్ళి నాడు గుడక మాంసం ఏంది రా? ఒక్క దినము గుడక ఉండలేవా?” అంటూ రాయ‌ల‌సీమ యాస‌లో డైలాగ్స్ తో న‌వ్వు తెప్పించ‌డంలో జ‌యప్ర‌కాష్ రెడ్డి స్టైయిలే వేరు.విలనైనా, క‌మెడియ‌న్ అయినా.

TeluguStop.com - Jaya Prakash Reddy Entry Movies Tollywood

బాష ఏదైనా క్యార‌క్ట‌ర్ ఎలాంటిదైనా స్క్రీన్ పై త‌న న‌ట‌న‌తో మంత్ర‌ముగ్ధుల్ని చేసిన జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి క‌ర్నూల్ జిల్లా లో జ‌న్మించారు.తండ్రి సాంబిరెడ్డి ఎస్సై కావ‌డంతో క‌ర్నూల్, నెల్లూరు, అనంత‌పురంల‌లో త‌న విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

స్వ‌తహాగా జ‌య ప్రకాష్ రెడ్డికి నాట‌కాలంటే చాలా ఇష్టం.

TeluguStop.com - టీచర్ మీద కోపంతో సినిమాల్లోకి వచ్చిన నటుడు ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ ఇష్టంతోనే త‌న‌ తండ్రితో క‌లిసి నాట‌కాలు వేసేందుకు వెళ్లేవారు.

ఆ నాట‌కాల పిచ్చి ఎలా ఉందంటే.త‌న చిన్న‌తనంలో గుండాచారి అనే సైన్స్ మాస్ట‌ర్ ఉండేవారు.

ఆ సైన్స్ మాస్ట‌ర్ కు నాట‌కాల పిచ్చి ఎక్కువ‌గా ఉండేది.స్కూల్ అయిపోయిన త‌రువాత పిల్ల‌ల్ని పిలిపించుకొని ఇంట్లోనే త‌న‌ముందు నాట‌కాలు వేయించుకునేవాడు.

అలా ఓ రోజు తాను కూడా సైన్స్ మాస్ట‌ర్ ఎదుట‌ నాట‌కం వేసిన‌ట్లు చెప్పాడు జేపీ.ఆ నాట‌కం త‌నకు న‌చ్చ‌లేదని మొహం మీద చెప్ప‌డంతో త‌ట్టుకోలేక రెండు గంట‌లు ఏడ్చిన జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి ఆయ‌న‌పై కోపంతో సినిమాల్లోకి రావాల‌నుకున్నాడు.

అలా మొద‌లైన జేపీ నాట‌కాల పిచ్చి వెండితెర న‌వ్వుల రేడుగా మార్చేసింది.

అలా 1988లో త‌న తండ్రి సాంబిరెడ్డి న‌ల్గొండ అడిష‌న‌ల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు.

ఆ త‌రువాత డాక్ట‌ర్ రామారావు మొమోరియ‌ల్ ఆర్ట్స్ అనే డ్రామా కంపెనీని ప్రారంభించారు.ఈ డ్రామా కంపెనీ ప్రారంభానికి డైర‌క్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు ముఖ్య అతిధిగా వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా జేపీ చేసిన యాక్టింగ్ కు ముగ్ధులైన దాస‌రి.స్టేజ్ పైన ఉన్న ఆయ‌నను ఆలింగ‌నం చేసుకున్నారు.

న‌ల్గొండ కొండ‌ల మ‌ధ్య ఓ వ‌జ్రం ఉంద‌ని.ఆ వ‌జ్రం ఇక్క‌డ కాదు సినిమా ఇండ‌స్ట్రీలో ఉండాల‌ని చెప్పాడు.

అలా నాట‌కం ముగిసిన వారం రోజుల్లోనే చిరంజీవి న‌టించే యాక్ష‌న్ అడ్వంచ‌ర‌ల్ మూవీ బ్ర‌హ్మ‌పుత్రుడు లో ఆ సినిమా డైర‌క్ట‌ర్ దాస‌రి న‌టుడిగా త‌న‌కు అవ‌కాశం ఇచ్చార‌ని గుర్తు చేసుకున్నారు జేపీ.

#Guntur #ActorJaya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jaya Prakash Reddy Entry Movies Tollywood Related Telugu News,Photos/Pics,Images..