బాలీవుడ్ ఇండస్ట్రీని తప్పు పట్టడం కరెక్ట్ కాదు : జయాబచ్చన్

పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభలో సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి.లోక్ సభలో భోజ్ పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం అధికంగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

 Jaya Bachchan Serious On Bjp Mp Ravi Kishan Comments, Parliament, Bollywood Indu-TeluguStop.com

దీనిపై స్పందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ సతీమణి, సమాజ్ వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ఆ గ్రహం వ్యక్తం చేశారు.ఈ రోజు ఉదయం రాజ్యసభ సమావేశంలో ఎవరో చేసిన తప్పుకు ఇండస్ట్రీని నిలదీయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.

రాజ్యసభలో జయాబచ్చన్ మాట్లాడుతూ.‘‘ కొంత మంది వ్యక్తులు చేసిన తప్పులకు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు పట్టడం సరికాదు.ఆ పరిశ్రమ నుంచే పాపులారిటీ, పేరు సంపాదించుకుని ఇప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తే సోమవారం లోక్ సభలో మాట్లాడటం విచారకరం.ఆ వ్యాఖ్యలు విని సిగ్గుపడాల్సి వచ్చింది.

అన్నం పెట్టిన చేతులే నరుక్కున్నట్లుగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు.’’ అని ఆమె పేర్కొన్నారు.

నిన్న జరిగిన లోక్ సభ సమావేశంలో ఎంపీ రవికిషన్ ఈ విధంగా మాట్లాడారు. దేశ యువత పెడదారిన పడుతోందన్నారు.

పాకిస్తాన్, చైనాల నుంచి ప్రతి ఏటా దేశంలోకి డ్రగ్స్ అక్రమంగా చేరుతుందని, నేపాల్, పంజాబ్ సరిహద్దుల ద్వారా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతోందన్నారు.బాలీవుడ్ లో కూడా డ్రగ్స్ సరఫరా అధికంగా జరుగుతోందని చెప్పడంతో జయాబచ్చన్ విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube