మీడియాపై చిందులు వేసిన జయా బచ్చన్.. మండిపడుతున్న నెటిజెన్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ గురించి మనకు తెలిసిందే.అయితే ఈమె ఏదైనా ఈవెంట్ నిమిత్తం బయటకు వచ్చిన ప్రతిసారి మీడియాపై చిందులు వేస్తూ ఉంటారు .

 Jaya Bachchan Gets Angry On Media Details, Jaya Bachchan,media, Netizens,nitya N-TeluguStop.com

ఇప్పటికే ఇలా ఎన్నో సార్లు జరిగినప్పటికీ జయ బచ్చన్ మాత్రం తరచూ ఇలా ఫోటోగ్రాఫర్ల పై మండిపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో తన మనవరాలు నిత్య నివేలితో కలిసి ఈ ఈవెంట్ కిహాజరైన ఈమె మరోసారి కెమెరామెన్లు అక్కడే ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వేడుకలో భాగంగా ఓ మీడియా ప్రతినిధి వీరి ఫోటోలను తీయడం కోసం రావడంతో ఒక్కసారిగా జారిపడ్డారు.అయితే ఇది గమనించిన జయా బచ్చన్ మీకు ఇదే సరైనది అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాదు మీరు రెట్టింపు వేగంతో పడతారు అంటూ వారిపై మండిపడ్డారు.ఈ విధంగా జయ బచ్చన్ మీడియా పై మండిపడగా అక్కడే ఉన్నటువంటి తన మనవరాలు తననే శాంతింప చేయడం కోసం ప్రయత్నించిన ఈమె మాత్రం మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Actressjaya, Amitab Bachhan, Bollywood, Jaya Bachchan, Netizens, Nitya Ni

ఆప్ లోగ్ కౌన్ హై? మీరు ఏ మీడియా సంస్థకు చెందిన వారనిపెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇది చూసినటువంటి ఎంతోమంది నెటిజన్లు జయా బచ్చన్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఆమెకు మీడియాతో మాట్లాడే పద్ధతి తెలియదా రెట్టింపు వేగంతో కింద పడాలని కోరుకోవడం ఏంటి? కనీస జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలా కిందపడిపోవాలని కోరుకోరు.ఇలాంటి సెలబ్రిటీలకు మీడియా ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకండి అంటూ పెద్ద ఎత్తున నేటిజెన్లు జయా బచ్చన్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube