అమితాబ్ బచ్చన్ పై జయా బచ్చన్ స్ట్రాంగ్ కంప్లైంట్.. ఏంటంటే?

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కౌన్ బనేగా కరోడ్ పతి.

 Jaya Bachchan Complaint On Amitab Bachchan Not Answering Calls Kbc Details,  Ami-TeluguStop.com

ప్రస్తుతం ఈ షో 13వ సీజన్ ను జరుపుకుంటోంది.అంతేకాకుండా ఈ సీజన్ కేబిసి 1000 వ ఎపిసోడ్ మైలురాయిని కూడా చేరుకుంది.

ఈ క్రమంలోనే హాట్ సీట్లో కూర్చొని క్విజ్ లో పాల్గొనడానికి తన కూతురు శ్వేతా బచ్చన్, అలాగే మనవరాలు నవ్వా నవేలి నందాలను అమితాబచ్చన్ షోకి ఆహ్వానించారు.

వీరితో పాటు అమితాబచ్చన్ భార్య జయాబచ్చన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షోకి గెస్ట్ గా హాజరయ్యారు.

ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గతంలో విడుదల చేసిన ప్రోమోలో అమితాబ్ బచ్చన్, భార్య జయాబచ్చన్ అనుబంధం చూపించారు.ఇదిలా ఉంటే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో అమితాబ్ బచ్చన్ పై జయాబచ్చన్ ఫిర్యాదు చేసింది.

ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయరు అని కంప్లైంట్ చేసింది.

ఇంటర్నెట్ వస్తూ పోతూ ఉంటే నేను ఏం చేయను అంటూ అమితాబ్ ఫన్నీగా తనని తాను సమర్థించుకున్నారు.అప్పుడు కూతురు శ్వేత బచ్చన్ జోక్యం చేసుకొని జయా బచ్చన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ.సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం,ట్వీట్లు పెట్టడం చేస్తారని గుర్తు చేసింది.

ఇక వెంటనే అమితాబ్ టాపిక్ మారుస్తూ జయ నువ్వు చాలా అందంగా ఉన్నావని అనగా వెంటనే స్పందించిన జయా మీరు అబద్ధాలు చెప్పేటప్పుడు బాగుండరు అని సరదాగా బదులిస్తుంది.మొత్తానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube