సినిమా పరిశ్రమలో కొండంత టాలెంట్ ఉన్నా రవ్వంత అదృష్టం ఉండాలంటారు.ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో కూడా ఎవరికి తెలియదు.
అయితే సినీ పరిశ్రమలో హీరోలుగా వారు క్లిక్ అయితే అయితే వాళ్ళకు చాలా ఏళ్ల లైఫ్ ఉంటుంది.కాని హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు.
వారిని ఒక సినిమాలో తీసుకోవాలంటే చాలా క్యాలుక్యూలేషన్స్ చూస్తారు.అయితే ఇవన్నీ దాటుకొని ఒక సినిమా అవకాశం పొంది ఆ సినిమా కనుక సూపర్ హిట్ అయితే ఇక ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవడం ఖాయం.
అదే ఇంకా మొదటి సినిమాకే జరిగితే ఇక ఆ నటి ఎంతో అదృష్టవంతురాలని చెప్పవచ్చు.
అయితే ఈ మాటలన్నీ జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లాకు ఖచ్చితంగా సరిపోతాయని చెప్పవచ్చు.
మొదటి సినిమా జాతిరత్నాలు సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఫరియాకు మరో స్టార్ హీరో సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఫరియాకు మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించే అవకాశం కొట్టేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో చేయబోయే సినిమాలోనటించనుందని సమాచారంవిడుదలైన రెండో రోజునే బంపర్ ఆఫర్ కొట్టేయడంతో ఫరియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.