బీర్ వద్దు అదే ముద్దంటున్న జాతిరత్నాలు చిట్టి.. ఫేవరెట్ బ్రాండ్ తో?

తొలి సినిమాతోనే అందం, అభినయంతో మెప్పించి అవకాశాలను సంపాదించుకునే నటీమణుల సంఖ్య తక్కువగా ఉంటుంది.అయితే జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఫరియా అబ్దుల్లా మాత్రం తొలి మూవీతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకులలో నటిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు.

 Jatiratnalu Chitti Video Goes Viral In Social Media  , 10 Interesting Facts, Bre-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా జాతిరత్నాలు చిట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది.

క్యూట్ లుక్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫరియా ఇన్ స్టాగ్రామ్ లో తన డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు.

అటు క్లాసికల్ డ్యాన్స్ అయినా వెస్టర్న్ డ్యాన్స్ అయినా అద్భుతంగా చేయగల ప్రతిభ ఫరియా అబ్దుల్లాకు ఉంది.అయితే ఈ బ్యూటీ తాజాగా చేతిలో బ్రీజర్ బాటిల్ తో రచ్చరచ్చ చేశారు.

బ్రీజర్ బాటిల్ ను పట్టుకుని ఫరియా డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

బ్రీజర్ అంటే తనకు ఇష్టమని ఫరియా అన్నారు.

ఫరియా ఈ వీడియోలో తన డ్రెస్సింగ్ సెన్స్ తో అదరగొట్టారనే చెప్పాలి.ఉత్సాహంగా డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఫరియా అదరగొట్టారనే చెప్పాలి.

తనదైన శైలిలో వీడియో చేసి ఆ వీడియో ద్వారా బ్రీజర్ కు ఫరియా ప్రచారం కల్పించడం గమనార్హం.బ్రీజర్ పండ్ల ఆధారిత ఆల్కహాల్ డ్రింక్ కాగా బ్రీజర్ 4.8 శాతం ఆల్కహాల్ ను కలిగి ఉంటుంది.

మరోవైపు జాతిరత్నాలు సినిమా అటు థియేటర్లలో ఇటు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినప్పటికీ ఫరియా అబ్దుల్లా మాత్రం వేగంగా సినిమాల్లో నటించడం లేదు.ఫరియా అబ్దుల్లా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.ఫరియా అబ్దుల్లా ఈ ఏడాదైనా వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube