బాలకృష్ణ సినిమాలో జాతిరత్నం..!

నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్ లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

 Jathiratnam Naveen Polishetty In Balakrishna Movie Naveen Polishetty , Balakrishna , Anil Ravipudi , Gopichand Malinani , Tollywood-TeluguStop.com

ఇక ఈ మూవీ తర్వాత అనీల్ రావిపుడితో బాలయ్య బాబు సినిమా ప్లానింగ్ లో ఉంది.దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తారని టాక్.

ఇప్పటికే కథ ఓకే అవగా సినిమాలో బాలకృష్ణతో పాటుగా మరో యంగ్ హీరో నటిస్తాడని టాక్.ఇంతకీ బాలయ్య సినిమాలో నటించే హీరో ఎవరంటే ఇంకెవరు జాతిరత్నం నవీన్ పొలిశెట్టి అని తెలుస్తుంది.

 Jathiratnam Naveen Polishetty In Balakrishna Movie Naveen Polishetty , Balakrishna , Anil Ravipudi , Gopichand Malinani , Tollywood-బాలకృష్ణ సినిమాలో జాతిరత్నం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి సోలోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.మరోపక్క బాలయ్య 108వ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది.

సినిమాలో అతని పాత్ర కూడా చాలా ఫన్నీగా ఉంటుందని అంటున్నారు.సినిమాలో నవీన్ పొలిశెట్టి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని అంటున్నారు.

అనీల్ రావిపుడి ఎఫ్ 3 ఈ నెల 27న రిలీజ్ అవుతుంది.ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమానే ఉంటుందని చెప్పుకుంటున్నారు.

మరి బాలయ్య తో అనీల్ రావిపుడి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube