'జాతి రత్నాలు' సెకండ్‌ రిలీజ్ కు అంతా సిద్దం.. మళ్లీ రికార్డు ఖాయం

నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా థియేటర్ల లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.దాదాపుగా 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన జాతి రత్నాలు సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారం పై వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

 Jathiratnalu Streeming In Amazon Prime Date Fix-TeluguStop.com

ఎట్టకేలకు అమెజాన్ వారు జాతి.రత్నాలు సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు గా ప్రకటించారు.

ఈ సినిమాను ఈ నెల 11వ తారీకు నుండి ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.జాతి రత్నాలు సినిమా ను మహానటి దర్శకుడు నాగ అశ్విన్ నిర్మించిన విషయం తెలిసిందే.

 Jathiratnalu Streeming In Amazon Prime Date Fix-జాతి రత్నాలు’ సెకండ్‌ రిలీజ్ కు అంతా సిద్దం.. మళ్లీ రికార్డు ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో నటించిన ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ల కామెడీ సూపర్ హిట్ అవ్వడం లో కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో మరో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్నాడు.

సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి టాలీవుడ్ లో హీరోగా పేరు తెచ్చుకున్న దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమా డిజిటల్ వర్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు గా ప్రేక్షకులు చెబుతున్నారు.

 ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.కాని ఈ సినిమా మాత్రం కరోనా పరిస్థితులను తట్టుకుని నిల్చుని సక్సెస్‌ అయ్యింది.

కనుక అమెజాన్‌ ప్రైమ్‌ లో కూడా సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.రికార్డు స్థాయి వ్యూస్‌ తో జాతి రత్నాలు అమెజాన్‌ లో ట్రెండ్‌ సెట్‌ చేస్తుందేమో చూడాలి.

 ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడీగా ఫరియా నటించిన విషయం తెల్సిందే. 

.

#JathiRatnalu #Jathi Ratnalu #JathiRatnalu #Amazon Prime #Mahanati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు