జాతిరత్నాలు దర్శకుడు డాన్‌ ను 'ప్రిన్స్‌' చేశాడు

జాతిరత్నాలు సినిమా తో దర్శకుడిగా సూపర్‌ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు అనుదీప్‌.ఈయన రెండవ సినిమా ఎప్పుడు ఎవరితో ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా తమిళ యంగ్‌ స్టార్‌ హీరో శివ కార్తికేయన్ ను డైరెక్ట్‌ చేసే అవకాశం దక్కించుకున్నాడు.

 Jathiratnalu Director Anudeep And Shivakarthikeyan Movie Title As Prince Jathira-TeluguStop.com

డాక్టర్‌ వరుణ్‌ మరియు డాన్ సినిమా లతో బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ లను దక్కించుకున్న శివ కార్తికేయన్ ఇప్పుడు అనుదీప్‌ దర్శకత్వం లో తెలుగు లో ఒక సినిమా ను చేస్తున్నాడు.ఆ సినిమా కు ప్రిన్స్ అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది.

జాతిరత్నాలు మాదిరిగా కాకుండా పూర్తి విభిన్నంగా ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

శివ కార్తికేయన్ కు తెలుగు లో ఇప్పటికే కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమా తో గుర్తింపు ఉంది.

ఆ సినిమా లో కీలక పాత్రలో నటించాడు.తెలుగు లో ఈయన నటించిన తమిళ సినిమా లు డాక్టర్‌ మరియు డాన్ లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

ఇప్పుడు నేరుగా తెలుగు సినిమా తోనే శివ కార్తికేయన్‌ రాబోతున్న నేపథ్యం లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో ప్రిన్స్ అనే టైటిల్ ను యూనివర్శ్‌ గా ఖరారు చేయడం జరిగింది.తెలుగు మరియు తమిళంలోనే కాకుండా ఇతర భాష ల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

టైటిల్‌ ను రివీల్‌ చేశారు.త్వరలోనే ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటిస్తారు.

ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube