జాతిరత్నాలు 'చిట్టి' కి అరుదైన రికార్డ్‌ దక్కింది

నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన జాతిరత్నాలు సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.భారీగా వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా మ్యూజికల్‌ గా కూడా సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.

 Jathiratnalu Chitti Nee Navvante Song Record Views,latest Tollywood News-TeluguStop.com

ముఖ్యంగా ఈ సినిమాలోని చిట్టి నీ నవ్వంటే పాట మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీగా వ్యూస్ ను దక్కించుకున్నాయి.చిట్టి నీ నవ్వంటే తాజాగా యూట్యూబ్ లో 100 మిలియన్‌ ల వ్యూస్ రికార్డును దక్కించుకుంది.

ఈమద్య కాలంలో పెద్ద సినిమాలు వంద మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం కామన్ విషయం.కాని ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో వ్యూస్ ను దక్కించుకోవడం చాలా పెద్ద విషయం.

Telugu Chittinee, Jathiratnalu-Movie

చిట్టి నీ నవ్వంటే లిరికల్‌ వీడియో మరియు కు వచ్చిన రెస్పాన్స్‌ అద్బుతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా కు రాధన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించిన విషయం తెల్సిందే.అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడీగా ఫరియా అద్బుల్లా నటించిన విషయం తెల్సిందే.ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం నవీన్ పొలిశెట్టికి మంచి డిమాండ్ ఉంది.

అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన రాధన్ కూ మంచి క్రేజ్ దక్కింది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సంగీతాన్ని అందించిన దర్శకుడు రాధన్ కు ముందు ముందు మరిన్ని చిన్న పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ లు లేకపోవడంతో నవీన్ కొత్త సినిమా లు ఏమీ కూడా లేకపోవడం వల్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతి రత్నాలు ముందు ముందు మరెన్ని రికార్డులను దక్కించుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube