జోగిపేట నుంచి అమెరికా... జాతిరత్నాలు సీక్వెల్ పై కసరత్తు

జోగిపేట జాతి రత్నాలు హైదరాబాద్ వెళ్లి ఎన్ని కష్టాలు పడ్డారో చూపించి కడుపుబ్బా నవ్వించిన చిత్రం జాతిరత్నాలు.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఊహించని రేంజ్ లో హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.

 Jathi Ratnalu's Sequel To Be Made Soon, Tollywood, Nag Ashwin, Anudeep Kv, Navee-TeluguStop.com

నిర్మాత నాగ్ అశ్విన్ కి భారీ లాభాలు తెచ్చి పెట్టింది.ఈ సినిమా దెబ్బకి బాగుందనే టాక్ తెచ్చుకున్న శ్రీకారం సినిమా కలెక్షన్స్ మొత్తం పడిపోయాయి అంటే ఏ రేంజ్ లో ప్రేక్షకులపై ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు.

దర్శకుడు అనుదీప్ జాతి రత్నాలుతో ఒక్కసారిగా క్రేజీ దర్శకుడుగా మారిపోయాడు.ఇక ఇందులో నటించిన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఫన్ రైడ్ కి ప్రేక్షకులు సీట్లో కూర్చోకుండా కడుపుబ్బా నవ్వుకున్నారు.

చాల రోజుల తర్వాత మనస్పూర్తిగా ప్రేక్షకులు నవ్వుకున్న చిత్రంగా జాతిరత్నాలుకి అందరి నుంచి ప్రశంసలు లభించాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ట్ తెలుస్తుంది.

జాతిరత్నాలు క్యారెక్టర్స్ సమాజంలో ఉండే చాల మంది యూత్ కి దగ్గరగా ఉండటంతో పాటు, మనం రోజువారి మాట్లాడుకునే సరదా సంభాషణలతో ఫన్ జెనరేట్ చేసిన విధానం ఆకట్టుకుంది.దీంతో దీనికి రీమేక్ వర్క్ అవుట్ అవుతుందని భావించిన నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ రెడీ చేయమని దర్శకుడు అనుదీప్ కి చెప్పినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో అనుదీప్ కూడా ఇప్పటికే ఒక స్టొరీ లైన్ సిద్ధం చేసుకున్నాడని సమాచారం.కనీసం అచ్చమైన తెలంగాణ తెలుగు తప్ప మరో బాష తెలియని జోగిపేట జాతి రత్నాలు తమ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు వారికి ఎదురవుతాయి అనే ఎలిమెంట్ తో ఈ సీక్వెల్ కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అయిపోతే అనుదీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అవుతుందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube