టీవీలో కూడా సూపర్ హిట్ కొట్టిన జాతిరత్నాలు!

ప్రస్తుత కాలంలో కమర్షియల్, యాక్షన్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉండటంతో కామెడీ సినిమాలకు కాలం చెల్లిపోయిందని చాలామంది భావిస్తున్న సమయంలో “జాతి రత్నాలు” సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది.జాతి రత్నాలు సినిమా ద్వారా నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేసిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

 Jathi Rathnalu Movie Silver Screen Telecast Trp Ratings, Jathi Ratnalu, Tollywoo-TeluguStop.com

ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

మొదటి దశ కరోనా తర్వాత థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఈ సినిమా కి పెట్టిన బడ్జెట్ కన్నా నాలుగింతలు సంపాదించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న జాతిరత్నాలు టీవీలో కూడా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కె.వి.అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15న జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Telugu Trp, Views, Faria Abdulls, Gemini Tv, Jathi Ratnalu, Kv Anudeep, Nag Ashw

ఆగస్టు 15వ తేదీన జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమా 10.21 టిఆర్పి రేటింగ్ ను కైవసం చేసుకుంది.ఈ సినిమాను ఇంకాస్త ముందుగా టీవీలో ప్రసారం చేసి ఉంటే మరింత రేటింగ్స్ తో దూసుకుపోయేదని పలువురు భావిస్తున్నారు.

ఏదిఏమైనప్పటికీ అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై కూడా అద్భుతమైన క్రేజ్ సంపాదించుకొని జాతి రత్నాలు దూసుకుపోయిందని చెప్పవచ్చు.ఇక పోతే ఈ సినిమాలో “చిట్టి నీ నవ్వంటే” అనే పాట ప్రస్తుతం యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని ట్రెండ్ అవుతుంది .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube