జాతిరత్నాలు బాలీవుడ్ కి తీసుకెళ్తున్న స్వప్నదత్

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఊహించని స్థాయిలో సెన్సేషన్ హిట్ అయిన సినిమా జాతిరత్నాలు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సిటీలో సెటిల్ అయ్యే యువత ఆలోచనలకి దగ్గరగా ఉండటంతో సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

ఇక సినిమాలో మెయిన్ లీడ్స్ చేసిన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్, యాక్టింగ్ టైమింగ్ కూడా సినిమా హిట్ కావడానికి ఒక కారణం అని చెప్పాలి.దర్శకుడు అనుదీప్ కథని చెప్పే విధానం కూడా చాలా నేచురల్ గా అనిపించడంతో అందరికి విపరీతంగా కనెక్ట్ అయ్యింది.

అసలు సినిమాలో ఎలాంటి కథనం లేదని విమర్శలు వచ్చిన అవుట్ అండ్ అవుట్ ఫన్ జెనరేట్ చేయడంతో దాని చిత్రంలో ఉన్న మైనస్ లని ఎవరూ పట్టించుకోలేదు.ఈ కారణంగా సినిమా నిర్మాత నాగ్ అశ్విన్, స్వప్న దత్ కి భారీ లాభాలు తెచ్చి పెట్టింది.

ఇప్పుడు ఓ వైపు దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తూనే మరో వైపు బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడానికి నిర్మాత స్వప్న దత్ ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.హీరో నవీన్ పోలిశెట్టి ఇప్పటికే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చిచ్చోరే అనే సినిమాలో నటించాడు.

Advertisement

ఆ సినిమాలో నవీన్ తన పాత్రతో ఫుల్ ఫన్ జెనరేట్ చేసి సినిమా హిట్ లో భాగం అయ్యాడు.ఈ నేపధ్యంలో అతనితోనే హిందీ రీమేక్ కూడా చేయాలని స్వప్న భావిస్తుంది.

ఇక మిగిలిన రెండు పత్రాలకి మంచి టైమింగ్ ఉన్న యంగ్ కమెడియన్స్ ని తీసుకోవాలని చూస్తున్నారు.మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు