ప్రతి పదేళ్లకు ఒకసారి సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.ఎప్పుడూ ఒకే తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరించరు.
ప్రస్తుతం ప్రేక్షకులు కథ, కథనం కంటే కామెడీకే ప్రాధాన్యత ఇస్తున్నారు.జాతిరత్నాలు, మ్యాడ్, టిల్లు స్క్వేర్ సినిమాల సక్సెస్ ను చూస్తే సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిస్థాయిలో మారిపోయిందని అర్థమవుతుంది.
అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాతిరత్నాలు మూవీ( Jathi Ratnalu ) రిలీజైన సమయంలో ఏ స్థాయిలో హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందించింది.
ఆ తర్వాత మ్యాడ్ సినిమా( Mad Movie ) కూడా ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించింది.తాజాగా విడుదలైన టిల్లు స్క్వేర్ కూడా అదే జాబితాలో చేరింది.

రాబోయే రోజుల్లో ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను దర్శకనిర్మాతలు ఎంచుకుంటే సులువుగా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి.టిల్లు స్క్వేర్ మూవీ( Tillu Square Movie ) అయితే ఏకంగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

సితార బ్యానర్ కు ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు భలే కలిసొస్తున్నాయని చెప్పవచ్చు.పెద్ద సినిమాలతో పోల్చి చూస్తే చిన్న సినిమాలే కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి.సితార నిర్మాతలు సైతం చిన్న సినిమాలు అందిస్తున్న లాభాల విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా సితార నిర్మాతలు మ్యాడ్ మ్యాక్స్ ను ప్లాన్ చేస్తున్నారు.టిల్లు స్క్వేర్ సినిమాలా మ్యాడ్ మ్యాక్స్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.
మ్యాడ్ మ్యాక్స్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.