జాతి రత్నాలు హీరోయిన్ బాలీవుడ్ ప్రయత్నాలు

జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా ఒక్కసారి టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన సుందరి ఫరియా.ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లలో అనుష్కలా పొడవుగా ఉండటంతో పాటు మంచి శరీరాకృతి ఉండటం ఇట్టే ఆకట్టుకుంది.

 Jathi Ratnalu Fame Faria Movie Trails In Bollywood-TeluguStop.com

అలాగే ఆమె నవ్వు కూడా ఫరియా అందానికి అదనపు ఆకర్షణగా నిలిచింది.మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యి నటిగా ఆమెకి కూడా మంచి మార్కులు పడ్డాయి.

సినిమాలో ఈ అమ్మడు ఫన్ కూడా క్రియేట్ చేయడంతో ఫరియాకి టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.అయితే టాలీవుడ్ ఫరియాకి పొడవు ప్రధాన సమస్యగా మారింది.

 Jathi Ratnalu Fame Faria Movie Trails In Bollywood-జాతి రత్నాలు హీరోయిన్ బాలీవుడ్ ప్రయత్నాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలు ఎవరూ కూడా ఫరియా కంటే పొట్టిగానే ఉంటారు.దీంతో ఆమెని హీరోయిన్ గా తీసుకుంటే తమ ఇమేజ్ డిస్టర్బ్ అవుతుందని అందరూ భావించే పరిస్థితి ఉంది.

ఈ కారణంగా టాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో ఫరియాకి అవకాశాలు రావడం లేదు.

అయితే ఈ బ్యూటీ మాత్రం తన గ్లామర్ ని మరింతగా దర్శకుల దృష్టిలో పడే విధంగా మంచి హాట్ ఫోటోషూట్ లు చేస్తూ సోషల్ లో పెడుతుంది.

మరోవైపు టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో అయితే తనకి వేగంగా అవకాశాలు వస్తాయని అక్కడ కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.తన లుక్ బాలీవుడ్ సినిమాలకి కరెక్ట్ గా సరిపోతుందని భావించి అటుగా ట్రైల్స్ చేస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ కోసం ఒక మూవీకి ఒకే చెప్పెసిందని టాక్ వినిపిస్తుంది.కరోనా సెకండ్ వేవ్ సిచువేషన్ నార్మల్ అయిన తర్వాత ఈ సినిమా గురించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

అలాగే తెలుగులో కూడా కొంత మంది దర్శకులు ఫరియాని సంప్రదిస్తున్నారని, అయితే స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన స్థాయిలో కథలు ఉండే విధంగా చూసుకోవాలని ఫిక్స్ అయిన ఆమె చిన్న సినిమాలకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చర్చ నడుస్తుంది.

#JathiRatnalu #Directors #SouthIndian #JathiRatnalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు