తమిళ హీరోతో చేతులు కలుపుతున్న జాతిరత్నం

టాలీవుడ్‌లో ఒకేఒక్క సినిమాతో తనకంటూ మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న దర్శకుల్లో యంగ్ డైరెక్టర్ అనుదీప్ కూడా ఒకరు.జాతిరత్నాలు అనే సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ డైరెక్టర్, ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేసే పనిలో ఉన్నాడు.

 Jathi Ratnalu Director To Join Hands With Tamil Hero, Jathi Ratnalu, Anudeep, Si-TeluguStop.com

ఇప్పటికే తన నెక్ట్స్ మూవీ కోసం కథను రెడీ చేస్తున్న ఈ డైరెక్టర్ త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు.అయితే ఈసారి ఏకంగా ఓ తమిళ హీరోతో ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించేందుకు అనుదీప్ ప్లాన్ చేస్తున్నాడు.

తెలుగులో నవీన్ పోలిశెట్టితో కలిసి జాతిరత్నాలు లాంటి కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన ఈ డైరెక్టర్, మరోసారి తన నెక్ట్స్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించే పనిలో ఉన్నాడు.తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించేందుకు అనుదీప్ రెడీ అయ్యాడు.

ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు అనుదీప్ పక్కా కథను రెడీ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.కాగా ఈ సినిమాలో శివకార్తికేయన్ పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా జాతిరత్నాలు చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న అనుదీప్, తన నెక్ట్స్ చిత్రాన్ని ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడుతున్నాయి.

కాగా ఇదే బ్యానర్ త్వరలో తెరకెక్కనున్న శేఖర్ కమ్ముల ధనుష్ పాన్ ఇండియా చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం.ఏదేమైనా జాతిరత్నాలు డైరెక్టర్ తన నెక్ట్స్ చిత్రంతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

మరి శివకార్తికేయన్‌తో అనుదీప్ తెరకెక్కించే చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుంతో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube