2021 కోర్ట్ రూమ్ ఎపిసోడ్స్ లో జాతి రత్నాలు బెస్ట్ అంటున్న నెటిజన్లు

ఈ ఏడాదిలో థియేటర్ కి వచ్చి హిట్ అయిన సినిమాలలో ఓ మూడు సినిమాలు కోర్టు బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్స్ ఉండటం, అందులో లాయర్ పాత్రలు సినిమా సక్సెస్ లో కీలక కావడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.తెలుగు సినిమాలలో కోర్టు రూమ్ ఎపిసోడ్స్ ఎప్పుడూ కూడా మంచి సక్సెస్ అవుతూ ఉంటాయి.

 Jathi Ratnalu Courtroom Drama Best In This Year-TeluguStop.com

కోర్టు రూమ్ లో వాదోపవాదాలు అందరిని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.అలాగే భావోద్వేగంగా కూడా ఉంటాయి.

ఈ కారణంగా ఆ ఎపిసోడ్స్ కి తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది.ఈ కోర్టు రూమ్ డ్రామాతో ఈ ఏడాది చెక్, నాంది, జాతి రత్నాలు, వకీల్ సాబ్ సినిమాలు ఎప్పటి వరకు వచ్చాయి.

 Jathi Ratnalu Courtroom Drama Best In This Year-2021 కోర్ట్ రూమ్ ఎపిసోడ్స్ లో జాతి రత్నాలు బెస్ట్ అంటున్న నెటిజన్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీటిలో చెక్ మూవీ తప్ప మిగిలిన మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ముఖ్యంగా ఈ మూడు సినిమాలలో కోర్టు రూమ్ డ్రామా అద్బుతంగా వర్క్ అవుట్ అయ్యి సినిమా సక్సెస్ కి కారణం అయ్యింది.

నాంది సినిమాలో లాయర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించింది.జాతిరత్నాలు సినిమాలో లాయర్ గా హీరోయిన్ ఫరియా నటించింది.

ఇక వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించారు.

ఇక ఈ మూడు లాయర్ పాత్రలలో బెస్ట్ అంటే మాత్రం చాలా మంది నెటిజన్లు జాతిరత్నాలు సినిమాలో లాయర్ పాత్ర అని చెప్పడం విశేషం.

నాంది, వకీల్ సాబ్ సినిమాలో కోర్టు రూమ్ డ్రామా సీరియస్ గా సాగుతూ ఉంటుంది.అయితే ఇప్పటి వరకు లేని విధంగా మొదటి సారి కోర్టు రూమ్ డ్రామాని అవుట్ అండ్ అవుట్ ఫన్ జెనరేట్ చేసిన జాతిరత్నాలు సినిమానే బెస్ట్ అని నెటిజన్లు కామెంట్స్ పెట్టడం విశేషం.

అలాగే జాతిరత్నాలు సినిమాలో లాయర్ పాత్రలో తెలిసీ తెలియని జ్ఞానంతో ఫరియా చేసిన ఓవర్ యాక్టింగ్ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.ఈ కారణంగా ఆ సినిమాలో లాయర్ పాత్రనే బెస్ట్ అంటూ చెప్పుకొస్తున్నారు.

#Anudeep KV #JathiRatnalu #Faria #Jathi Ratnalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు