భారత జట్టులో ఆ మ్యాచ్ తో రీఎంట్రీ ఇవ్వనున్న జస్ ప్రీత్ బుమ్రా.. !

Jaspreet Bumrah Will Re-enter The Indian Team With That Match , Jas Preet Bumrah, Australia, Asia Cup, ODI World Cup, T20 Series, Sports

భారత జట్టు స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ( Jas Preet Bumrah )గత కొంతకాలంగా వెన్ను నొప్పి కారణంతో క్రికెట్ కు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే.గత ఏడాది ఆస్ట్రేలియా( Australia ) తో జరిగిన టీ20 సిరీస్ లో రెండో మ్యాచ్ లో భారీ గాయం అయింది.

 Jaspreet Bumrah Will Re-enter The Indian Team With That Match , Jas Preet Bumrah-TeluguStop.com

ఈ ఏడాది న్యూజిలాండ్ వెళ్లి అక్కడే ఆపరేషన్ చేయించుకున్నాడు.ఆపరేషన్ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో విశ్రాంతి తీసుకుని కోలుకుంటున్నాడు.

అయితే ప్రస్తుతం బుమ్రా చాలావరకు కొలుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

త్వరలోనే భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.స్వయంగా బుమ్రా నే తన ఇన్స్టాలో ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు.

అందులో తన ప్రాక్టీస్ కు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి.ఈ వీడియోకు కమింగ్ హోం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

అంటే త్వరలోనే భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు చెప్పకనే చెప్పాడు.

గత ఏడాది సెప్టెంబర్ నుండి క్రికెట్ కు దూరంగా ఉన్న బుమ్రా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్, డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లకు దూరమయ్యాడు.అయితే ఈ ఏడాది చివరలో జరిగే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ( Asia Cup, ODI World Cup )లలో భారత జట్టులో చేరే అవకాశం ఉంది.దాదాపుగా ఒక సంవత్సరం పాటు భారత జట్టులో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది.

ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కోసమే ప్రాక్టీస్ సెషన్ లో నిమగ్నం అయినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం బుమ్రా చాలా వరకు కోలుకొని, ప్రాక్టీస్ సెషన్లో ఏకంగా 8 నుండి 10 ఓవర్ల వరకు బౌలింగ్ చేస్తున్నాడని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube