2007లో పిల్లలు.. 2017లో పెళ్లి.. 2022లో డివోర్స్.. ఈ జంట కథ మాములుది కాదు!

Jason Momoa Announce Separation His Wife Lisa Bonet After 16 Year

హాలీవుడ్ నటుడు జాసన్ మొమోవా, అతని భార్య లీసా బోనెట్ తో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటన చేశారు.వీరిద్దరూ తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తాజాగా గురువారం రోజు వెల్లడించారు.

 Jason Momoa Announce Separation His Wife Lisa Bonet After 16 Year-TeluguStop.com

వీరిద్దరూ 2005 నుంచి డేటింగ్ మొదలు పెట్టారు.ఆ తరువాత వీరికి 2007 లో లోలా 2008లో నకోకా వొళ్ఫ్ అనె ఇద్దరు పిల్లలు జన్మించారు.

ఆ తరువాత ఈ జంట 2017 అక్టోబర్ లో పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంతో ఒక్కటయ్యారు.

పెళ్లికి ముందు అన్నేళ్ల పాటు డేటింగ్ చేసి పిల్లలు కలిగిన తరువాత మరి కొన్నేళ్ళకు పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లయిన 4 ఏళ్ళకే అనగా 2017 లో పెళ్లి చేసుకొని 2022 లో విడిపోతున్నట్లు ప్రకటించారు.

కాలంతో పాటు వస్తున్న ఎన్నో రకాల మార్పులు మనమంతా అనుభవిస్తూ ఉన్నాం.ఈ క్రమంలోనే ఎన్నో ఇబ్బందులను కూడా చూశాం.అందుకే నా కుటుంబం అతీతమేమీ కాదు.మేము కూడా విడాకులు తీసుకుని విడిపోతున్నాం.

కానీ మా మధ్య ప్రేమ అలాగే కొనసాగుతుంది.అది వివిధ మార్గాల్లో అభివృద్ధి చెందుతుంది.

ఇక మా ఇద్దరికి పుట్టిన పిల్లల బాధ్యతను ఇద్దరమూ పంచుకుంటాము అంటూ ఇంస్టాగ్రామ్ లో తాజాగా పోస్ట్ చేశారు ఈ జంట.

ఇకపోతే నటుడు జాసన్ మొమోవా ఆక్వా మెన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, డ్యూన్ వంటి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ఇకపోతే ప్రస్తుతం అతను జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన ఆక్వా మెన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇక అతని భార్య లీసా పలు షోలలో కూడా నటించింది.

అయితే సెలబ్రెటీలు విడిపోవడం ఇదేమి కొత్త కాదు.ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లికి ముందు డేటింట్ లు చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొన్నేళ్ల తర్వాత విడిపోయిన జంటలు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి.

కానీ మిగతా జంటల తో పోల్చుకుంటే ఈ జంట కాస్త భిన్నంగా డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుని అనంతరం ఒక్కటయ్యి, ఇప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించారు.ఈ జంట విడిపోతున్నట్లు చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Lisa Bonet #Divorce #Jason Momoa #Hollywood #Aquaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube