తలలో పెట్టుకునే మల్లెపూల వల్ల ఆమె పెళ్లి ఆగిపోయింది..! అసలేమైందో తెలుస్తే షాక్ అవుతారు.!  

Jasmine Flower Stopped Marriage-

కట్నం తక్కువైందని పెళ్లి ఆగిపోవడం వినుంటారూ.లేదంటే మగపెళ్లివారికి మర్యాదలో లోటు జరిగిందని పెళ్లి ఆగిపోయిందని వినుంటారూ కానీ పూలు మారాయని పెళ్లి ఆగిపోవడం గురించి ఎక్కడయినా విన్నారా.

Jasmine Flower Stopped Marriage- Telugu Viral News Jasmine Flower Stopped Marriage--Jasmine Flower Stopped Marriage-

వినుండరు కదా బట్ పెళ్లికూతురు మల్లెపూలకు బదులు కాగడాలు పెట్టుకొచ్చిందని పెళ్లి ఆగిపోయింది.మీరు చదివింది అక్షరాలా నిజం.అయినా పెళ్లికూతురు కావాలి కానీ పూలతో పనేంటో నాకైతే అర్దం కాలేదు.ఇంతకీ ఇంతటి ఫన్నీ పెళ్లి క్యాన్సిల్ ఎక్కడో తెలుసా.

ఫన్నీ అని ఎందుకన్నాను అంటే పూలు మారాయని పెళ్లి క్యాన్సిల్ అనగానే అమ్మాయి వాళ్లు ఏడుస్తూ కూర్చోలేదు.అదే టైంకి వేరే పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేసేసారు.

Jasmine Flower Stopped Marriage- Telugu Viral News Jasmine Flower Stopped Marriage--Jasmine Flower Stopped Marriage-

బెంగళూరులోని హొసకోటె తాలూకాలో చిక్కనహళ్లి గ్రామానికి చెందిన ఆనంద్‌కు విజయపుర పట్టణానికి చెందిన యువతితో భీమాకనహళ్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో వివాహం నిశ్చయించారు.వివాహ పనులు ప్రారంభమైన కాసేపటికి వధువు పెళ్లి మండపంలోకి అడుగుపెడుతుండగా వధువు జడ అలంకారం విషయమై వధూవరుల కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.

మల్లెపువ్వులతో కాకుండా కాగడా మల్లెలతో వధువు జడను అలంకరించారంటూ వరుడు కుటుంబ సభ్యులు వాగ్వాదం చేయగా.సమయానికి మల్లెపువ్వులు లభించకపోవడంతో కాగడాలతో అలంకరించాల్సివచ్చిందంటూ వధువు కుటుంబ సభ్యులు నచ్చచెప్పసాగారు.

అయినప్పటికీ వరుడు కుటుంబ సభ్యులు వినిపించుకోకపోవడంతో ఇరు కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం శృతి మించింది.వరుడు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

దీంతో పాలుపోని స్థితిలో చిక్కుకున్న వధువు కుటుంబ సభ్యులు అదే ముహూర్తానికి అదే దేవాలయంలో మరొక యువకుడితో వివాహం జరిపించారు.అదీ విషయం.

తాజా వార్తలు

Jasmine Flower Stopped Marriage- Related....