ఎయిర్ పోర్ట్ లో వింత మహిళ....ఆమె సూట్ కేస్ ఓపెన్ చేసి చూసిన అధికారులు షాక్.. ఇంతకీ అందులో ఏముందో తెలుసా...

సాధారణంగా మనం ఏదైనా దేశానికి వెళ్తే అక్కడి నుండి ఇంటికి తిరుగు ప్రయాణం అయినపుడు ఆ దేశానికి సంబందించిన వస్తువులో లేదా ఏదైనా విలువైన వస్తువులనో కొనుక్కుని వస్తాం.కొన్ని వస్తువులు ఇతర దేశాలకు తీసుకెళ్లాలంటే పన్ను కట్టాల్సిందే , మరికొన్ని వస్తువులు అసలు తీసుకెళ్లాడమే నేరం .

 Japanese Woman Arrested For Smuggling 19 Lizards In Australia 19-TeluguStop.com

అలా ఒక జపాన్ అమ్మాయి ఆస్ట్రేలియా కి చూడటానికి వచ్చి స్వదేశానికి తిరుగు ప్రయాణం అయేటపుడు ఎయిర్ పోర్ట్ లో అధికారులు ఆమె దగ్గర ఉన్న సూట్ కేస్ ని చెక్ చేయడానికి ఓపెన్ చేయగా వారు షాక్ కి గురయ్యారు.ఇంతకీ అందులో ఎమున్నాయో తెలుసా ? బల్లులు అవును నిజమే బల్లులే ఉన్నాయి .అందుకు ఆమెని అరెస్ట్ కూడా చేసారు , అసలు విషయం ఏంటంటే…

ఆస్ట్రేలియా అందాలు చూడటానికి వచ్చిన ఒక 27 ఏళ్ల జపాన్ అమ్మాయి తన పర్యటన మొత్తం ముగించుకొని స్వదేశానికి టికెట్ ని బుక్ చేసుకుంది.మెల్బోర్న్ విమానాశ్రయం నుండి జపాన్ వెళ్లేందుకు ఆమె విమానం ఎక్కాల్సి ఉంది.

ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన ఆ అమ్మాయి సెక్యురిటి కి దూరంగా లోపలికి వెళ్తుండగా ఆమె సూట్ కేస్ కాదులుతున్నట్లు కనిపించింది , అంతే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ లు ఆమె సూట్ కేస్ ని స్కాన్ చేయడం కోసం అడిగారు.ఆమె వారికి సూట్ కేస్ ని అప్పగించింది.

సూట్ కేస్ ను స్కాన్ చేయగా అందులో ఏవో ప్రాణులు కదులుతున్నట్లు తెలిసింది.షాకైన అధికారులు ఆ సూట్‌కేసులో ఏముందని అడిగారు.

అందులో ఏమి లేవు నా పర్సనల్ ఐటమ్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.దానితో అధికారులకు అనుమానం వచ్చి సూట్ కేస్ ని తెరిచి చూస్తే అందులో 19 రకాల ఆస్ట్రేలియా జాతి బల్లులు ఉన్నాయి.

వాటిలో 17 సింగిల్ బ్యాక్ జాతి బల్లులు కాగా మరో రెండు బ్లూ టంగ్ లిజార్డ్స్ (నీలి నాలిక బల్లులు).

ఆస్ట్రేలియా లో బల్లులను ఇలా స్మగ్లింగ్ చేయడం నేరం , అందుకని ఆమెని అక్కడి పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.

ఆమె దగ్గర ఉన్న బల్లులను తీసుకొని పర్యావరణ రక్షణ సిబ్బంది కి అప్పగించారు.వాటిని ఎం చేస్తారు అని ఆ మహిళ అడగగా బల్లులను అడవుల్లో వదిలేయడమో లేక ఎక్కడైనా స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తారట.

పర్యావరణ రక్షణ విషయంలో ఆస్ట్రేలియా అధికారులు ఎంత కఠినంగా ఉంటారో ఈ సంఘటన చెబుతోంది.అసలు ఆమె బల్లులను ఎందుకు తీసుకెళ్లనుకుంది ఇంత వరకు తెలియలేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube