జపాన్ వాసులు వినియోగించే వింత టాయిలెట్ల గురించి తెలుసా?

సాధారణంగా మన దేశంలో చాలామంది టాయిలెట్ల గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఇష్టపడరు.టాయిలెట్ల గురించి ఎవరైనా మాట్లాడినా వింతగా చూస్తారు.

 Japanese People  Different Toilet Compared To Indians, Japanese, Toilets, Indian-TeluguStop.com

భారత్ లో ఎక్కువగా ఇండియన్ స్టైల్ టాయిలెట్లు, వెస్టర్న్ స్టైల్ టాయిలెట్లను వినియోగిస్తారు.ఎవరి అవసరాలకు తగినట్లు వాళ్లు టాయిలెట్లను ఎంపిక చేసుకుంటారు.

అయితే మన దేశంలో వినియోగించే టాయిలెట్లే ఇతర దేశాల్లో కూడా వినియోగిస్తారనుకుంటే పప్పులో కాలేసినట్లే.

జపాన్ దేశంలో ప్రజలు ఉపయోగించే టాయిలెట్లకు మన దేశంలో ఉపయోగించే టాయిలెట్లకు అసలు పొంతనే ఉండదు.

రెండు రకాల టాయిలెట్లను జపాన్ దేశ ప్రజలు వినియోగిస్తారు.చూడటానికి ఒకే విధంగా కనిపించే టాయిలెట్లు నిజానికి వేర్వేరుగా ఉంటాయి.

ఒకటి ఫ్లష్ సిస్టమ్ లేని టాయిలెట్ కాగా ఇందులో షీల్డ్ కు వ్యతిరేక దిశలో రంధ్రం ఉంటుంది.రెండో టాయిలెట్ ఫ్లష్ సిస్టమ్ ఉన్న టాయిలెట్ కాగా ఇందులో షీల్డ్, రంధ్రం ఒకే వైపుకు ఉంటాయి.

Telugu Flush Toilets, Indian Toilets, Indians, Japan Toilets, Japanese, Japanese

ఈ రెండు టాయిలెట్లలో షీల్డ్ కు ఎదురుగానే కూర్చోవాల్సి ఉంటుంది.అయితే సీటు లోతుగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని మొత్తం కూర్చోకూడదు. ఫ్లష్ సిస్టమ్ లేని టాయిలెట్లను సెఫ్టిక్ ట్యాంకుకు అనుసంధానం చేయగా ఫ్లష్ సిస్టమ్ ఉన్న టాయిలెట్లను సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీకు అనుసంధానం చేస్తారు.ఈ టాయిలెట్లు మాత్రమే కాక జపాన్ లో ఎలక్ట్రిక్ టాయిలెట్లు కూడా ఉన్నాయి.

జపాన్ శాస్త్రవేత్తలు టాయిలెట్లలో సైతం టెక్నాలజీని వినియోగించడం గమనార్హం.

ఎలక్ట్రిక్ టయిలెట్లలో బటన్ నొక్కగానే క్లీనింగ్ కావడంతో పాటు వేడి వ్యాక్యూమ్ వల్ల క్రిములు సైతం నశిస్తాయి.

ఎలక్ట్రిక్ టాయిలెట్ల వినియోగం వల్ల చెడు వాసన సైతం వచ్చే అవకాశాలు ఉండవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube