గుడ్ల గూబ ఆఫీసర్స్ గురించి మీకు తెలుసా?  

సాధారణంగా ఆఫీసర్స్ అంటే మనకు మనుషులే గుర్తొస్తారు.కానీ కొన్ని ఇన్వెస్టిగేషన్ లో కుక్కలను ఉపయోగిస్తూ ఉండటం మనం చూసే ఉంటాం.

TeluguStop.com - Japanese Fruit Farmers Employ Owls As Pest Control

నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులకు కుక్కలు ఎంతో సహకరిస్తాయి.కానీ గుడ్లగూబ ఆఫీసర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించినా అక్కడ గుడ్లగూబలకు నైట్ డ్యూటీలను అప్పగించారు.సాధారణంగా గుడ్లగూబలు రాత్రిళ్లు తన విధులను నిర్వర్తిస్తూ పగలు నిద్రపోతూ ఉండటం మనకు తెలిసిన విషయమే.అయితే ఈ గుడ్లగూబలను నైట్ డ్యూటీలో ఎక్కడ? ఎందుకు పెట్టుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం…
జపాన్ లో రైతులు గుడ్లగూబల సహాయంతో లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.గుడ్లగూబలు రాత్రి సమయంలో సంచరిస్తాయన్న సంగతి మనకు తెలుసు.రాత్రి సమయంలో గుడ్లగూబ దృష్టి ఎంతో మెరుగ్గా ఉంటుంది.

జపాన్ లో ఆపిల్ తోటలు పండించే రైతులు యాపిల్ తోటలలో సుంచులు, ఎలుకలు ఎక్కువగా సంచరించి పంటను నాశనం చేస్తున్నాయి.అయితే పంట లో అధిక దిగుబడిని పొందడానికి అక్కడి రైతులు వినూత్నమైన ఆలోచన చేశారు.
గుడ్లగూబలు ఎక్కువగా సంచరించడం వల్ల రాత్రి సమయాలలో వాటికి ప్రత్యేకమైన సదుపాయం, ఆహారం కల్పించారు.దీంతో గుడ్లగూబలు పంటపొలాల్లో రాత్రంతా యాపిల్ తోటలలో తిరిగే సుంచులను, ఎలుకలను వేటాడేవి.

TeluguStop.com - గుడ్ల గూబ ఆఫీసర్స్ గురించి మీకు తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇలా ప్రతి రోజు వేటాడడం వల్ల వాటి బెడద తగ్గిపోయి యాపిల్ పంటలో అధిక దిగుబడిని పొందుతున్నారు.ఈ విధంగా గుడ్ల గూబలను నైట్ సెక్యూరిటీ గార్డుగా నియమించుకొని లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.

ఇలా వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవడంలో జంతువులను వాడుకోవడం ఇది మొదటిసారి కాదు.ఈ తరహాలోనే థాయిలాండ్ లో వరి పంటలో కీటకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ వరి పంటలోకి బాతులను వదిలేవారు.

దీంతో ఎటువంటి క్రిమిసంహారకాలు వాడకుండా పంటపొలాలను రక్షించుకొని అధిక దిగుబడిని పొందేవారు.ఇంత అద్భుతమైన ఆలోచనలను మన దేశంలోని రైతులు కూడా ఉపయోగించడం వల్ల సహజసిద్ధమైన పంటలను పండించవచ్చు.

#JapaneseFarmers #Farmers #Japan #NightSecurity #Owl Officers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Japanese Fruit Farmers Employ Owls As Pest Control Related Telugu News,Photos/Pics,Images..