మారుతున్న టెక్నాలజీ కారణంగా మగవారు గర్బం దాల్చడంతో పాటు, ఇంకా ఎన్నో పనులు చేస్తున్నారు.లింగ మార్పిడి కారణంగా అమ్మాయిలు అబ్బాయిలుగా మరియు అబ్బాయిలు అమ్మాయిలుగా మారడం చాలా కామన్‌గా మనం చూస్తూనే ఉన్నాం.
ఇక ఈమద్య కాలంలో మగవారు పెళ్లి చేసుకోకుండానే తండ్రి అవ్వాలని ఆశ పడుతున్నారు.తమ స్పెర్మ్ ను మరో మహిళ సాయంతో పిల్లలుగా తయారు చేస్తున్నారు.
పిల్లల పెంపకంలో తల్లులకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తండ్రులు కూడా అన్ని విషయాల్లో ఆడవారితో పోటి పడుతున్నారు.
ఎంత పోటీ పడ్డా కూడా ఆడవారు ఇచ్చినట్లుగా బ్రెస్ట్ ఫీడింగ్ను మగవారు ఇవ్వలేరు.
తల కిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టినా కూడా అది సాధ్యం కాదని ఇన్నాళ్లు భావించేవారు.కాని మారిన టెక్నాలజీ, కొత్త పద్దతుల కారణంగా మగవారు సైతం బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేందుకు అవకాశం కలిగింది.
జపాన్‌కు చెందిన దెంత్సూ అనే ఒక గాడ్జెట్ల తయారి సంస్థ పురుషుల బ్రెస్ట్ ఫీడింగ్ పరికరంను తయారు చేయడం జరిగింది.ఆ పరికరంను బుజాలకు తగిలించుకుని పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ తరహాలో పాలు పట్టించే వీలు ఉంది.
ఔత్సాహిక తండ్రుల కోరిక మేరకు ఈ పరికరంను తయారు చేసినట్లుగా సదరు కంపెనీ ప్రకటించింది.ప్రతి ఒక్క మగాడికి కూడా ఇది ఉపయోగదాయకం అని, స్త్రీలు మాత్రమే కాకుండా పరుషులు కూడా ఎందుకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకూడదు అనే ఆలోచన నుండి మాకు ఇది పుట్టిందని సంస్థ వారు అంటున్నారు.పాలు నింపిన పరికరంను బుజాలకు తగిలించుకుని బ్రెస్ట్ ఫీడింగ్ తరహాలో చిన్న పిల్లలకు ఇచ్చే అవకాశం ఉంది.
ఎంత బ్రెస్ట్ ఫీడింగ్ అంటూ ఇచ్చినా కూడా తల్లి పాలను మరిపించేలా అవి ఉంటాయా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.పురుషులు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం అనేది అసాధ్యం అని, అది కూడా డబ్బా పాలు అనే విషయాన్ని గుర్తించాలని, కన్న తల్లి మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుందని, మరెవ్వరికి కూడా అది సాధ్యం కాదని మహిళలు అంటున్నారు.