ఎన్టీఆర్ పాటకి ఇరగదీసి డాన్స్ చేసిన జపాన్ జంట... సోషల్ మీడియాలో వైరల్

Japanese Couple Dance For Junior NTR Song, Ashok Movie, Tollywood, Telugu Cinema, South Cinema, Sameera Reddy

సోషల్ మీడియా, యుట్యూబ్ వచ్చిన తర్వాత సౌత్ ఇండియన్ సాంగ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది.సోషల్ మీడియాలో విపరీతంగా సౌత్ మాస్ బీట్స్ ఫేమస్ అవుతున్నాయి.

 Japanese Couple Dance For Junior Ntr Song, Ashok Movie, Tollywood, Telugu Cinema-TeluguStop.com

ఇక ఈ పాటలకి విదేశీయులు కూడా డాన్స్ లు చేస్తూ ఆదరగోడుతున్నారు.దీంతో మన పాటలు మరింత పాపులర్ అవుతున్నాయి.

ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ సౌత్ పాటలకి టిక్ టాక్ వీడియోలు చేసి పోస్ట్ చేయగా అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.ఇప్పుడు జూనియర్ ఎన్టీఅర్ పాత సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

దానికి కారణం ఓ జపాన్ జంట ఆ పాటకి ఎన్టీఆర్ తరహాలోనే డాన్స్ చేయడం వలన.

ఎన్టీఆర్, సమీరారెడ్డి నటించిన అశోక్ సినిమాలోని గోల గోల అనే మాస్ డ్యూయెట్ కి జపాన్ జంట డ్యాన్స్ ఇరగదీసింది.మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటకు ఎన్టీఆర్, సమీరారెడ్డి చేసిన డ్యాన్స్ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.2006లో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా పేరు తెచ్చుకుంది.ఇప్పుడు ఈ సినిమాలోని గోల గోల పాటకు జపాన్ జంట చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఎన్టీఆర్, సమీరల డ్యాన్స్ స్టెప్పులను అచ్చం అలాగే అభినయిస్తూ వీరు చేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది.

క్యాస్ట్యూమ్స్‌ను కూడా దాదాపు పాటలో ఉన్నవాటినే అనుకరించారు.ఈ జంట చేసిన డ్యాన్స్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube