ముఖాలను మాస్కుల్లా అమ్మేస్తున్నారు.. ఎక్కడంటే?

సాధారణంగా మనం బయట ఏవైనా జంతువుల మొహాలను మాస్కులగా అమ్మడం చూసే ఉంటాం, లేదా ప్రముఖ సెలబ్రిటీ ముఖ చిత్రాలను మాస్కులు గా అమ్మడం చూస్తూ ఉంటాం.కానీ మీరు ఎప్పుడైనా మీ ముఖాన్ని బయట మాస్కుల మాదిరిగా అమ్మడం చూశారా? కానీ ఆ దేశంలో తమ మొహాలను మాస్క్ గా తయారు చేయించి అమ్ముతున్నారు.ఇంతకీ ఆ దేశం ఏదంటే….

 Japanese Company Wants To Buy Your Face And Sell It As A Hyper Realistic Mask, J-TeluguStop.com

జపాన్‌ దేశం టోక్యోకు చెందిన కమెన్యా ఒమాటో’ అనే సంస్థ తయారుచేస్తున్న ఈ సరికొత్త ‘3D ఫేస్‌మాస్క్’ ల గురించి పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఈ సమస్త మనుషుల ముఖాన్ని 3D ప్రింట్ రూపంలో అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని ఓ వింత ప్రకటన చేసింది.అంతే కాకుండా ఇలా మాస్క్ లను చిత్రీకరించడానికి 40 వేల రూపాయలను చెల్లించి అందుకు అనుమతిని కూడా పొందామని ఆ సంస్థ పేర్కొంది.

ఈ ‘కమెన్యా ఒమాటో’ చేసిన ప్రకటనపై కొన్ని విమర్శలు తలెత్తాయి.ఇలా మనుషుల ముఖాలను 3D రూపంలో చిత్రీకరించడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి.

ఇదే అవకాశంగా తీసుకొని ఎంతోమంది మోసాలకు, నేరాలకు, దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.ఇందుకు స్పందించిన ఆ సమస్త స్వచ్ఛందంగా తమ ముఖ చిత్రాలను మార్కెట్లో త్రీడీ ప్రింట్ మాస్కులుగా అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

వీరి అనుమతి లేకుండా ఇతర వ్యక్తులకు మాస్క్ లను అమ్మమని స్పష్టంగా తేల్చిచెప్పింది.

తాజాగా ఈ సమస్త చేసిన ఈ ప్రకటనకు భారీ స్థాయిలో ఆదరణ లభించింది.

ఈ ప్రకటన విన్న తరువాత“మా ముఖాలను ప్రింట్ చేసి మాస్కులుగా వాడుకోండి” అంటూ పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు.ఇలా మాస్క్లను 3D రూపంలో చిత్రీకరించడం వల్ల ఈ సమాజంలో మనుషులను పోలిన మనుషులు కేవలం ఏడు మంది మాత్రమే కాకుండా వందల సంఖ్యలో ఉంటారనే చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube