అక్కడ కుక్కల అరుపులే రైలు హారన్.. ఎందుకో మీకు తెలుసా?

సాధారణంగా ట్రైన్ సౌండ్ అనగానే చికుచికుబుకు అని అందరికీ గుర్తొస్తుంటుంది.రైలు కూతను బట్టి జనాలు రైలు వస్తుందని అర్థం చేసుకుని స్టేషన్ల వద్దకు పరుగులు తీస్తుంటారు.

 Japan Trains Sound Horn Be Like Dogs Barking Because-TeluguStop.com

అయితే, ఒకవేళ ట్రైన్ సౌండ్ అలా కాకుండా కుక్కల అరుపులే ట్రైన్ కూతలా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.డిఫరెంట్‌గా ఉంటుంది కదా.అయితే, అలా ఎలా ఉంటుంది? ఉండబోదు అసలు.అని అనుకుంటే మీరు పొరపడినట్లే.

అక్కడ కుక్కల అరుపులే రైలు హారన్‌గా ఉన్నాయి.ఎక్కడంటే.

 Japan Trains Sound Horn Be Like Dogs Barking Because-అక్కడ కుక్కల అరుపులే రైలు హారన్.. ఎందుకో మీకు తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కుక్కల కూత వేసే ఆ ట్రైన్స్ జపాన్‌లో ఉన్నాయి.టెక్నాలజీలో అతి వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా జపాన్‌కు పేరుంది.

జపాన్ రైల్స్ వెరీ అడ్వాన్స్‌డ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బుల్లెట్ ట్రైన్స్ ఇక్కడ ఉన్నాయి.

అయితే, ఈ దేశంలో ట్రైన్స్‌కు వన్యప్రాణులు బ్రేక్స్ లా మారాయి.ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్స్‌పై వందలాదిగా జింకలు ప్రాణాలు కోల్పోయాయి.

దాంతో ప్యాసింజర్స్ తమ గమ్యాన్ని చేరుకోవడం ఆలస్యమయ్యేది.అయితే, ఇలా జింకలు రైల్వే పట్టాలపై రావడానికి గల కారణమేమిటంటే.

రైల్వే ట్రాక్‌కు, హిల్స్‌కు మధ్య జరిగే యాక్షన్‌లో కొన్ని ఐరన్‌ ఫిల్లింగ్స్‌పై కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి.అవి ఆకర్షించే రుచి కలిగి ఉండగా, వాటిని నాకేందుకుగాను జింకలు ట్రాక్స్‌పై వస్తుంటాయి.

అలా వచ్చిన జింకలు ట్రైన్స్ హారన్ కొట్టినా ఆ ప్రదేశం నుంచి వెళ్లకుండా అలానే ఉండిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకుగాను పలు చర్యలు చేపట్టాలనుకున్నారు.

జింకల ప్రాణాలను కాపాడేందుకు రైల్వే ట్రాక్‌పై సింహం పేడను ట్రాక్ పొడవుతా పూసి ఉంచారు.

Telugu Be Like, Bullet Trains, Deers On Railway Tracks, Dog Barking Train Horn, Dogs, Dogs Barking, Forest Animals On Railway Tracks, Japan Technology, Japan Trains, Lions, Sound Horn, Trains-Latest News - Telugu

దాంతో జింకలు ట్రాక్‌పైన సింహం ఉందని భయపడి రైల్వే ట్రాక్స్‌పైకి రావడానికి భయపడే ఆయా ప్రాంతాల్లోనే ఉండిపోయాయి.ఇక సమస్య పరిష్కరించబడిందని అధికారులు అనుకున్నారు.కానీ, వర్షం పడినప్పుడు సింహం పేడ కొట్టుకుపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.దాంతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకుగాను అధికారులు రైలు కూత శబ్దానికి కుక్క అరుపులను జోడించారు.20 సెకన్ల పాటు కుక్క అరుపులు వినిపిస్తుంటే జింకలు ట్రాక్‌ మీద నుంచి వెంటనే పారిపోతున్నాయి.ఈ విషయాన్ని గమనించిన రైల్వే అధికారులు కుక్కల అరుపులే హారన్‌గా ఉంచారు.మొత్తానికి అలా వన్యప్రాణుల రక్షణ కోసం జపాన్ రైళ్లు కుక్కల్లా అరుస్తున్నాయి.చూశారా.జపనీస్ ఐడియా అదిరిపోయింది కదా.అయితే, ఈ దేశంలో అన్ని ప్రాంతాల్లో కాకుండా వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లోనే ట్రైన్స్ కుక్కల్లా అరుస్తుంటాయి.

#Deers Railway #Dogs #Dogs #Animals Railway #Sound

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు