ఈ వింత ‘స్టిక్కర్’ని ఎప్పుడైనా చూశారా?  

japan theme park, screaming stickers, roller coaster ride, viral video - Telugu Japan Theme Park, Roller Coaster Ride, Screaming Stickers, Viral Video

కరోనా వైరస్ నియంత్రణకై అమలు చేసిన లాక్ డౌన్ ముగిసి ప్రపంచమంతటా నిదానంగా అన్లాక్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే తాజాగా జపాన్ లో పర్యటక ప్రాంతాలు అన్ని మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయ్.

 Japan Theme Park Screaming Stickers Roller Coaster Ride

మ్యూజియంలు, ఒపేరా హౌజ్‌, థీమ్స్‌ పార్కుల్లోకి సందర్శకులు ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ వింత స్టిక్కర్’ని ఎప్పుడైనా చూశారా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రోలర్ కోస్టర్ రైడ్ చేశాము అంటే అరవకుండా ఉండలేము.ఎందుకంటే భయంతో కూడిన అరుపులు మనకు తెలియకుండానే మన నోటి నుండి వస్తాయి.

కానీ కరోనా కట్టడి కోసం అక్కడ రైడ్ చేసే సమయంలో బిగ్గరగా అరవొద్దని ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే రోలర్ కోస్టర్ లో రైడ్ చేసే సమయంలో నిశ్శబ్దంగా ఉండటం కష్టమని భావించిన థీమ్‌ పార్క్‌ ఒకటి వినూత్నంగా ఆలోచించి ఓ పరిష్కారం కనుగొంది.

టూరిస్టులు ఫేస్‌ మాస్కుపైన స్క్రీమింగ్‌ స్టిక్కర్లు ధరించేలా ఏర్పాట్లు చేసింది.ఈ స్టిక్కర్లతో ఎగ్జయిట్‌మెంట్‌ మిస్‌ కాబోదని వారు చెప్పారు.

ఈ మాస్కులను ధరించడం ద్వారా పర్యాటకులు గట్టిగ అరుస్తున్నట్టు ఫీల్ అవుతారు అని తెలిపారు.ఈ ప్రయోగం తొలుత వారి ఉద్యోగులతో చేసినట్టు అది విజయవంతం అయినట్టు తెలిపారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మీరు ఓసారి ఆ వీడియో చూసేయండి.

#Viral Video #RollerCoaster

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Japan Theme Park Screaming Stickers Roller Coaster Ride Related Telugu News,Photos/Pics,Images..