గర్భిణీ స్త్రీలలాగా తిరుగుతున్న అధికార పార్టీ నాయకులు.. ఎందుకంటే ..?

జపాన్ దేశంలో అధికార పార్టీ నాయకులలోని కొందరు అగ్రనాయకులు గర్భిణీ స్త్రీల వలె అవతారం ఎత్తి సామాన్య ప్రజలను విస్తుపోయేలా చేస్తున్నారు.బహుశా ప్రపంచంలో ఇప్పటివరకు ఏ రాజకీయ నేత కూడా గర్భవతి రూపంలో కనిపించలేదేమో కానీ జపాన్ లో మాత్రం అధికార పార్టీ అగ్రనాయకులు అచ్చం గర్భవతుల మాదిరి గెటప్ వేసుకొని ప్రజల్లో తిరుగుతున్నారు.

 Japan Ruling Party Political Leaders In Pregnant Women Getup To Support Women-TeluguStop.com

అయితే ఇలా చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుస్తోంది.నిజానికి ఆ కారణం ఏంటో తెలిస్తే ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఎందుకు ఏమిటి అనేది ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

 Japan Ruling Party Political Leaders In Pregnant Women Getup To Support Women-గర్భిణీ స్త్రీలలాగా తిరుగుతున్న అధికార పార్టీ నాయకులు.. ఎందుకంటే ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆడవారిని మనుషులను సృష్టించే బ్రహ్మతో పోలుస్తుంటారు.

ఈ భూ ప్రపంచం పై ఆడవారికి ఉన్న సహన శక్తి ఎవరికీ ఉండదు అని కూడా అంటుంటారు.మహిళలు లేకపోతే మగవాళ్ళ ఉనికి అనేది ఉండదు.

అయితే నేటి సమాజంలో కొందరు మగవాళ్ళు తమకు జన్మనిచ్చిన అమ్మ కూడా ఒక మహిళ అన్న విషయాన్ని మరిచి ఇతర ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.కొందరు పశువుల్లా ప్రవర్తిస్తూ ఆడవారి పై లైంగిక దాడికి కూడా పాల్పడుతుంటారు.

మరికొందరు ఆడవారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ పశువుల కంటే నీచమైన స్థాయికి దిగజారుతున్నారు.

Telugu Japan, Japan Government, Japan Political Leaders, Mens, News Viral, Political Leaders, Politics, Pregnant Women, Pregnant Women Getup, Support Women, Takako Suzuki, Viral Latest-Latest News - Telugu

అయితే ఆడవారిపట్ల మగవారిలో ఉన్న ఇటువంటి నీచమైన ఆలోచనా ధోరణిని మార్చాలని రాజకీయ నేతలు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు.అదేంటంటే.గర్భవతి స్త్రీల వలె వేషం ధరించి.

గర్భధారణ సమయంలో మహిళలు ఎంతగా ఇబ్బంది పడతారో సామాన్య ప్రజలకు తెలియజేయడం.గర్భిణీ మహిళలు బిడ్డలు మోస్తున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో ప్రపంచానికి బలంగా చెప్పేందుకే జపాన్ అధికార పార్టీ నేతలు ఈ విధంగా సరికొత్త ఆలోచన చేశారు.

నిజానికి ఈ వినూత్నమైన ఆలోచన తకాకో సుజుకి అనే మహిళా నేతకు మొదటగా తట్టింది.అయితే ఆమె ఆలోచన నచ్చిన అధికార పార్టీ నేతలు వెంటనే 7 కిలోల జాకెట్ ధరించి తమ కడుపులో శిశువు పెరుగుతున్నట్లుగా గర్భిణీల స్త్రీల వలే ప్రత్యక్షమయ్యారు.

Telugu Japan, Japan Government, Japan Political Leaders, Mens, News Viral, Political Leaders, Politics, Pregnant Women, Pregnant Women Getup, Support Women, Takako Suzuki, Viral Latest-Latest News - Telugu

ఐతే జపాన్ అధికార పార్టీ నాయకులు పిల్లల సంరక్షణ, మహిళల భవిష్యత్తు, మహిళల వృత్తి, మహిళల పట్ల లింగ వివక్ష గురించి చర్చించగలిగే పలు సరికొత్త విధానాలను తీసుకువస్తారని తాను ఆశిస్తున్నానని తకాకో సుజుకి చెప్పుకొచ్చారు.మహిళల జాగ్రత్త విషయంలో చాలా దేశాలతో పాటు జపాన్ కూడా వెనుకంజలో ఉందని అందుకే ఈ వినూత్నమైన ఆలోచనతో తమ ప్రజల్లో మహిళల పట్ల మంచి భావన వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి నడుం బిగించామని తకాకో సుజు చెప్పుకొచ్చారు.ఏది ఏమైనా మహిళల ఇబ్బందులను అందరికీ తెలియజేసేందుకు జపాన్ అగ్రనాయకులు గర్భిణీల వేషధారణలో కనిపించేసరికి అక్కడి ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

#JapanPolitical #Support Women #PregnantWomen #Politics #Japan

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు